
క్రీడలు
సూరత్: విజయ్ హజారె వన్డే ట్రోఫీలో హైదరాబాద్కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. శుక్రవారం గ్రూప్- ఎ మ్యాచ్లో ఆ జట్టు 12 పరుగుల తేడాతో గుజరాత్ చేతిలో ఓడింది. మొదట గుజరాత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 222 పరుగులు చేసింది. కరన్ పటేల్ (78), జిజ్ఞేశ్ పటేల్ (67) అర్ధశతకాలతో రాణించారు. రవితేజ (4/45) నాలుగు వికెట్లతో ఆ జట్టును కట్టడి చేశాడు. సీవీ మిలింద్ (2/46) రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం స్వల్ప ఛేదనలో హైదరాబాద్ బ్యాట్స్మెన్ విఫలమవడంతో జట్టు 48 ఓవర్లలో 210 పరుగులే చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (54), బవనక సందీప్ (54) పోరాడినా ఫలితం లేకపోయింది. ప్రత్యర్థి బౌలర్లలో అర్జాన్ (3/36), హార్దిక్ పటేల్ (2/30), కరన్ (2/36) రాణించారు. మరోవైపు గ్రూప్- బి మ్యాచ్లో ఆంధ్ర 98 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్ చేతిలో ఓడింది.