
క్రీడలు
డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న హిమదాస్
గువాహటి: అసోం పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ (డీఎస్పీ)గా భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్ శుక్రవారం బాధ్యతలు తీసుకుంది. ప్రభుత్వ ప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ చేతుల మీదుగా ఆమె నియామక పత్రం అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ కావాలనే తన చిన్నప్పటి కల నిజమైందని వెల్లడించింది. 2018లో ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో 400మీ. పరుగులో స్వర్ణం గెలిచి సంచలనం సృష్టించిన హిమదాస్.. అక్కడి నుంచి అంతర్జాతీయ పతకాలు కొల్లగొడుతూనే ఉంది. అదే ఏడాది ఆసియా క్రీడల్లో వ్యక్తిగత రజతంతో పాటు రిలేలో రెండు బంగారు పతకాలు సొంతం చేసుకుంది.