close
Array
(
    [REDIRECT_REDIRECT_UNIQUE_ID] => YHNwW25v7lJBQI7mcrEATAAAAdE
    [SERVER_SIGNATURE] => 
    [UNIQUE_ID] => YHNwW25v7lJBQI7mcrEATAAAAdE
    [HTTP_CLOUDFRONT_IS_MOBILE_VIEWER] => false
    [HTTP_USER_AGENT] => Amazon CloudFront
    [HTTP_X_FORWARDED_FOR] => 3.236.231.14, 34.226.14.134
    [REDIRECT_REDIRECT_STATUS] => 200
    [PHPRC] => /etc/php.ini
    [SERVER_PORT] => 80
    [HTTP_HOST] => google.eenadu.net
    [HTTP_CLOUDFRONT_IS_SMARTTV_VIEWER] => false
    [HTTP_CLOUDFRONT_IS_DESKTOP_VIEWER] => true
    [REDIRECT_HANDLER] => php-fastcgi
    [DOCUMENT_ROOT] => /var/www/html/eenaduportal/eenadu
    [SCRIPT_FILENAME] => /var/www/html/eenaduportal/eenadu/index.php
    [REQUEST_URI] => /archivespage/archivenewsdetails/121042189/27-02-2021/eenaduspecial/n
    [SCRIPT_NAME] => /index.php
    [HTTP_VIA] => 1.1 d203e374ba383a11f7beaf8a1353c661.cloudfront.net (CloudFront)
    [HTTP_CLOUDFRONT_IS_TABLET_VIEWER] => false
    [PHP_FCGI_CHILDREN] => 0
    [PATH_INFO] => /archivespage/archivenewsdetails/121042189/27-02-2021/eenaduspecial/n
    [REMOTE_PORT] => 57106
    [PATH] => /usr/local/sbin:/usr/local/bin:/usr/sbin:/usr/bin
    [CONTEXT_PREFIX] => /cgi-bin/
    [PWD] => /var/www/cgi-bin
    [SERVER_ADMIN] => root@localhost
    [REDIRECT_UNIQUE_ID] => YHNwW25v7lJBQI7mcrEATAAAAdE
    [REQUEST_SCHEME] => http
    [REDIRECT_STATUS] => 200
    [PATH_TRANSLATED] => /var/www/html/eenaduportal/eenadu/archivespage/archivenewsdetails/121042189/27-02-2021/eenaduspecial/n
    [REMOTE_ADDR] => 10.0.0.14
    [HTTP_X_AMZ_CF_ID] => QfQnd_Py6eG-eDY14NcEiXFu4AnXeWrkTZeKvYm4L2b_c_1As-ie_g==
    [SHLVL] => 0
    [SERVER_NAME] => google.eenadu.net
    [SERVER_SOFTWARE] => Apache
    [QUERY_STRING] => 
    [HTTP_X_AMZN_TRACE_ID] => Root=1-6073705b-30a8a75a5d1e71a37934bb1f
    [SERVER_ADDR] => 10.0.1.54
    [GATEWAY_INTERFACE] => CGI/1.1
    [HTTP_X_FORWARDED_PORT] => 80
    [SERVER_PROTOCOL] => HTTP/1.1
    [HTTP_ACCEPT_ENCODING] => br,gzip
    [REDIRECT_URL] => /index.php/archivespage/archivenewsdetails/121042189/27-02-2021/eenaduspecial/n
    [REQUEST_METHOD] => GET
    [PHP_FCGI_MAX_REQUESTS] => 1000
    [CONTEXT_DOCUMENT_ROOT] => /var/www/cgi-bin/
    [HTTP_X_FORWARDED_PROTO] => http
    [ORIG_PATH_INFO] => /index.php/archivespage/archivenewsdetails/121042189/27-02-2021/eenaduspecial/n
    [ORIG_SCRIPT_NAME] => /cgi-bin/php.fastcgi
    [ORIG_SCRIPT_FILENAME] => /var/www/cgi-bin/php.fastcgi
    [ORIG_PATH_TRANSLATED] => /var/www/html/eenaduportal/eenadu/index.php/archivespage/archivenewsdetails/121042189/27-02-2021/eenaduspecial/n
    [PHP_SELF] => /index.php/archivespage/archivenewsdetails/121042189/27-02-2021/eenaduspecial/n
    [REQUEST_TIME_FLOAT] => 1618178139.6153
    [REQUEST_TIME] => 1618178139
)

ఈనాడు ప్రత్యేకం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
డబ్బుకొద్దీ గౌరవం

డాక్ట‘రేట్‌’.. రూ.50 వేలు
ప్రపంచ రికార్డుకైతే రూ.25 వేలు
అంగట్లో అమ్మకానికి నకిలీ పురస్కారాలు
ఈనాడు డిజిటల్‌ - హైదరాబాద్‌

రూ.5 వేలిస్తే జిల్లాస్థాయి రికార్డు, రూ.9 వేలిస్తే రాష్ట్రస్థాయి, రూ.15 వేలకు జాతీయస్థాయి, రూ.25 వేలకు అంతర్జాతీయ స్థాయి లేదా ప్రపంచ రికార్డు. ముందుగా రూ.2 వేలు చెల్లించి పేరు నమోదు చేయించుకోవాలి. వారంరోజుల్లో బంగారు పతకంతోపాటు ధ్రువపత్రం మీ చేతుల్లో ఉంటుంది. మీ పేరు ముందు ‘డాక్టరేట్‌’ కావాలా? రూ. 50 వేలు చెల్లిస్తే సరి! లేదా మరో నలుగురితో డబ్బులు కట్టిస్తే అదీ ఉచితమే...

* హైదరాబాద్‌ కేంద్రంగా కొన్ని నకిలీ సంస్థలు నడిపిస్తున్న దందా ఇది

హైదరాబాద్‌లో డబ్బులు తీసుకుని సన్మానాలు చేసే సంస్థలు కొన్ని ఉండేవి. ఈ వ్యవహారంపై ఎన్నో జోకులు, కార్టూన్లు.. కథలు. ఇప్పుడు మరికొన్ని సంస్థలు ఒక అడుగు ముందుకేసి నకిలీ డాక్టరేట్లు, అంతర్జాతీయ రికార్డుల్ని కూడా అమ్మకానికి పెట్టాయి. వీరు డబ్బులిస్తే చాలు.. ఏదో ఒక రికార్డు పేరుతో సర్టిఫికేట్‌ చేతిలో పెడతారు. డాక్టరేట్లు కూడా ఇస్తారు.. ఇలాంటివారు మరికొందరిని కూడగట్టి పెద్ద వేదికపై సన్మానం కూడా చేస్తారు. మీడియా కవరేజి, యూట్యూబ్‌ లైవ్‌ వంటివి అదనపు హంగులు.
అంతర్జాతీయ సంస్థల పేరిట దళారులు గౌరవ డాక్టరేట్లు, ప్రతిభా పురస్కారాలను అంగట్లో అమ్మేస్తున్నారు. పేరు ముందు ‘గౌరవం’ ఉండాలనుకునే వారే లక్ష్యంగా వివిధ రంగాల్లో ఈ పురస్కారాల్ని అందజేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసుకుంటూ డబ్బు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా నకిలీ రికార్డుల సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రముఖ రికార్డుల సంస్థల పేర్ల పక్కన వేరే పేర్లు జోడించి రికార్డులిస్తున్నారు. దీనికి నగరంలోని ప్రముఖులనే అతిథులుగా పిలుస్తుండటం విశేషం. ఓ సామాజిక కార్యకర్తకు కొద్దిరోజుల కిత్రం ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ వెళ్లింది. ‘మీ సేవా కార్యక్రమాల్ని చూశాం.. మా యూనివర్సిటీ తరఫున మీకు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వాలనుకుంటున్నామ’ని చెప్పారు. ధన్యవాదాలని చెప్పేలోపే.. అందుకు రూ.50 వేలు కట్టాలని అసలు విషయం బయటపెట్టారు. అందేంటని ప్రశ్నిస్తే మీ పేరు ముందు ‘డాక్టర్‌’ అని ఉండాలంటే ఆమాత్రం చెల్లించాలి.. మీ దగ్గర అంత డబ్బు లేకపోతే మరో నలుగురికి మా సంస్థని రిఫర్‌ చేయండి.. మీకు ఉచితంగా ఇస్తామని బదులిచ్చారు. సరేనన్న ఆ యువకుడు ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురికీ విషయాన్ని చెప్పి తను ఉచితంగానే ‘గ్లోబల్‌ పీస్‌ యూనివర్సిటీ’ పేరుతో గౌరవ డాక్టరేట్‌ని పొందారు. వారంరోజుల్లోనే ఇంటికి ఆ పట్టా చేరింది. ఆ కార్యకర్త పేరు ముందు ‘డాక్టర్‌’ కొనసాగుతుండటం గమనార్హం.

దొంగ రికార్డులు
ఇంటర్నేషనల్‌ రికార్డ్స్‌ పేరిట ఓ సంస్థ ఇప్పటికే వందలమంది నుంచి డబ్బులు వసూలు చేసిందనే సమాచారంతో ‘ఈనాడు’ ప్రతినిధి ఆ సంస్థను సంప్రదించగా.. ‘చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ ఏదైనా రంగంలో కనీస మెలకువలు తెలిస్తే చాలు మా రికార్డుల పుస్తకంలోకి పేరు ఎక్కిస్తామ’ని చెప్పారు సంస్థ నిర్వాహకులు. ముందుగా రూ. 2 వేలతో పేరు నమోదు చేసుకుంటే మెలకువలు తెలియకున్నా రికార్డుల్లో చోటు వచ్చేందుకు ఏంచేయాలో తామే నేర్పిస్తామని, మీడియా ముందు ఎలా చేయాలో కూడా చెబుతామని చెప్పడం గమనార్హం. రికార్డు బుక్‌ ఆస్ట్రేలియా నుంచి ముద్రితమై వస్తుందని.. దానికోసం రూ. 25 వేల దాకా ఖర్చు అవుతుందని చెప్పడం మరో విశేషం. ఆ సంస్థ వివరాల్ని ‘ఈనాడు’ ఆరా తీయగా నకిలీదని తేలింది. హైదరాబాద్‌ కేంద్రంగా 10కి పైగా నకిలీ సంస్థలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.
* ప్రస్తుతం నగరంలో దాదాపు 10కి పైగా సంస్థలు ఈ తంతు కొనసాగిస్తున్నాయి.
* కరాటే, పాటలు, నృత్యం, డ్రాయింగ్‌, రీడింగ్‌, స్టాంపుల సేకరణ ఇలా ఒక్కోదానికి ఓ కొత్త పేరుతో రికార్డులు, పురస్కారాల్ని ప్రదానం చేస్తున్నారు. కరోనా సమయంలో ఏమీ చేయని చాలామందికి వారియర్ల పేరిట కూడా పురస్కారాలు అందజేయడం విమర్శలకు తావిస్తోంది.
* పురస్కారాన్ని బట్టి మ్యాజిక్‌ బుక్‌, గ్లోబల్‌ బుక్‌ పేరిట సంస్థలు భారీగా వసూలు చేస్తున్నాయి. గిన్నిస్‌లాంటి సంస్థల పేర్లలో కొన్ని అక్షరాలు మార్చి మరీ మోసాలకు పాల్పడుతున్నాయి.

 

20 వేల మందికి ప్రదానం!
గ్లోబల్‌ పీస్‌ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్‌ పీస్‌ యూనివర్సిటీల నుంచి దేశవ్యాప్తంగా 20 వేలమంది గౌరవ డాక్టరేట్లు పొందగా ఇందులో 4 వేలమంది నగరం నుంచే ఉన్నారు. ఇటీవల మైసూరు కేంద్రంగా ఈ సంస్థ నిర్వహించిన స్నాతకోత్సవాన్ని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంస్థ నకిలీదని తేల్చి నిర్వాహకుల్ని అరెస్టు చేశారు. ఈ వేడుకల్లో హైదరాబాద్‌ నుంచి 50 మంది హాజరయ్యారు.

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.