
సినిమా
ముంబయి: అర్జున్‌కపూర్-రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘సర్దార్ కా గ్రాండ్సన్’. ప్రముఖ నటి నీనాగుప్తా కీలకపాత్ర పోషించారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. విదేశాల నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన ఓ యువకుడు(అర్జున్‌కపూర్), తన బామ్మ (నీనా గుప్తా) ఆఖరి కోరిక తీర్చడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కుటుంబ కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి కాశ్వీ నాయర్ దర్శకత్వం వహించారు. ‘సర్దార్ కా గ్రాండ్సన్’లో నటించడం పట్ల నటి నీనా గుప్తా ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో భావోద్వేగాలతో ఈ సినిమా రూపుదిద్దుకుందని ఆమె అన్నారు. అంతేకాకుండా తాను ఇలాంటి పాత్రను పోషించడం ఇదే మొదటిసారి అని ఆమె వివరించారు.