close
Array
(
    [REDIRECT_REDIRECT_UNIQUE_ID] => YHNyMoFxfpKj2U61i7LyLAAAAFE
    [SERVER_SIGNATURE] => 
    [UNIQUE_ID] => YHNyMoFxfpKj2U61i7LyLAAAAFE
    [HTTP_CLOUDFRONT_IS_MOBILE_VIEWER] => false
    [HTTP_USER_AGENT] => Amazon CloudFront
    [HTTP_X_FORWARDED_FOR] => 3.236.231.14, 64.252.68.249
    [REDIRECT_REDIRECT_STATUS] => 200
    [PHPRC] => /etc/php.ini
    [SERVER_PORT] => 80
    [HTTP_HOST] => google.eenadu.net
    [HTTP_CLOUDFRONT_IS_SMARTTV_VIEWER] => false
    [HTTP_CLOUDFRONT_IS_DESKTOP_VIEWER] => true
    [REDIRECT_HANDLER] => php-fastcgi
    [DOCUMENT_ROOT] => /var/www/html/eenaduportal/eenadu
    [SCRIPT_FILENAME] => /var/www/html/eenaduportal/eenadu/index.php
    [REQUEST_URI] => /archivespage/archivenewsdetails/121042693/27-02-2021/latestnews/n
    [SCRIPT_NAME] => /index.php
    [HTTP_VIA] => 1.1 bad10a325a27114250a7d64ce1bcf6ad.cloudfront.net (CloudFront)
    [HTTP_CLOUDFRONT_IS_TABLET_VIEWER] => false
    [PHP_FCGI_CHILDREN] => 0
    [PATH_INFO] => /archivespage/archivenewsdetails/121042693/27-02-2021/latestnews/n
    [REMOTE_PORT] => 58422
    [PATH] => /usr/local/sbin:/usr/local/bin:/usr/sbin:/usr/bin
    [CONTEXT_PREFIX] => /cgi-bin/
    [PWD] => /var/www/cgi-bin
    [SERVER_ADMIN] => root@localhost
    [REDIRECT_UNIQUE_ID] => YHNyMoFxfpKj2U61i7LyLAAAAFE
    [REQUEST_SCHEME] => http
    [REDIRECT_STATUS] => 200
    [PATH_TRANSLATED] => /var/www/html/eenaduportal/eenadu/archivespage/archivenewsdetails/121042693/27-02-2021/latestnews/n
    [REMOTE_ADDR] => 10.0.0.14
    [HTTP_X_AMZ_CF_ID] => -H4v9FxQFR6PgzjgHjgiddhe0Xl2CMRr7-iP66sRViHXV3lvruV3ng==
    [SHLVL] => 0
    [SERVER_NAME] => google.eenadu.net
    [SERVER_SOFTWARE] => Apache
    [QUERY_STRING] => 
    [HTTP_X_AMZN_TRACE_ID] => Root=1-60737232-2e86e28c4b3ec0050b81764a
    [SERVER_ADDR] => 10.0.1.54
    [GATEWAY_INTERFACE] => CGI/1.1
    [HTTP_X_FORWARDED_PORT] => 80
    [SERVER_PROTOCOL] => HTTP/1.1
    [HTTP_ACCEPT_ENCODING] => br,gzip
    [REDIRECT_URL] => /index.php/archivespage/archivenewsdetails/121042693/27-02-2021/latestnews/n
    [REQUEST_METHOD] => GET
    [PHP_FCGI_MAX_REQUESTS] => 1000
    [CONTEXT_DOCUMENT_ROOT] => /var/www/cgi-bin/
    [HTTP_X_FORWARDED_PROTO] => http
    [ORIG_PATH_INFO] => /index.php/archivespage/archivenewsdetails/121042693/27-02-2021/latestnews/n
    [ORIG_SCRIPT_NAME] => /cgi-bin/php.fastcgi
    [ORIG_SCRIPT_FILENAME] => /var/www/cgi-bin/php.fastcgi
    [ORIG_PATH_TRANSLATED] => /var/www/html/eenaduportal/eenadu/index.php/archivespage/archivenewsdetails/121042693/27-02-2021/latestnews/n
    [PHP_SELF] => /index.php/archivespage/archivenewsdetails/121042693/27-02-2021/latestnews/n
    [REQUEST_TIME_FLOAT] => 1618178610.576
    [REQUEST_TIME] => 1618178610
)

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ప్రైవేటులో టీకా.. డోసుకు ₹250

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఒక్కో డోసు ధరను రూ.250గా నిర్ణయించింది. ఇందులో టీకా ధరతో పాటు, సర్వీస్‌ఛార్జి ఇమిడి ఉంటాయి. వ్యాక్సిన్‌ ధర రూ.150 కాగా.. సర్వీస్‌ ఛార్జిగా ఒక్కో వ్యక్తి నుంచి రూ.100 ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేస్తాయని కేంద్రం తెలిపింది. కొవిడ్‌ టీకా రెండు డోసుల్లో వేసుకోవాల్సి ఉండడంతో ‘ప్రైవేటు’లో ఒక్కో వ్యక్తి రూ.500 ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేసే వ్యాక్సిన్‌కు అయ్యే ఖర్చును మాత్రం కేంద్రమే భరించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 37,041 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 118 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ వల్ల గడిచిన 24 గంటల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,89,799కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,169కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 86 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,81,963కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణ ఉద్యమకారుడికి కేటీఆర్ సాయం

తొలితరం తెలంగాణ ఉద్యమాకారుడు డా. కొల్లూరి చిరంజీవికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. చిరంజీవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. చిరంజీవి కుటుంబసభ్యులతో స్వయంగా మాట్లాడిన కేటీఆర్‌.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి తక్షణ సాయంగా రూ.10 లక్షలు అందేలా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

​​​​​​4. జడ్జిలను దూషించడం ట్రెండ్‌ అయిపోయింది

న్యాయమూర్తుల పట్ల వ్యక్తిగత దూషణలకు దిగుతుండటం పట్ల కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అసహనం వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా తీర్పు రాని పక్షంలో కొందరు వ్యక్తులు న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని పరుష పదజాలంతో దూషించే ధోరణి ఇటీవల పెరిగిపోయిందన్నారు. పట్నాలో నూతనంగా నిర్మించిన హైకోర్టు నూతన భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రొటీన్‌ పాత్రలు చేసి బోర్‌ కొట్టింది: లావణ్య

తన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’తో అటు అందంలోనూ, ఇటు నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది లావణ్య త్రిపాఠి. తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. తాజాగా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’,‘చావు కబురు చల్లగా’ చిత్రాల్లో ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 5న విడుదల కానున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ విశేషాలను ఆమె ప్రేక్షకులతో పంచుకున్నారు. అవేంటో ఒకసారి చూసేద్దామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 25కి.మీ. రోడ్డు.. 18 గంటల్లో పూర్తి..!

అతివేగంగా నిర్మించిన ఓ జాతీయ రహదారికి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం దక్కింది. కర్ణాటకలోని చొల్లాపూర్‌, విజయ్‌పూర్‌ల మధ్య 25.54 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులను కేవలం 18 గంటల్లోనే పూర్తి చేయడం ద్వారా ఈ ఘనతను సాధించారు. అంతకు ముందు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఈ రోడ్డు పనులను ప్రారంభించారు. అతివేగంగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించడంపై నితిన్‌ గడ్కరీ సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తమిళనాట రాజకీయ సందడి మొదలైంది! 

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన మరుసటి రోజు నుంచే రాజకీయం ఊపందుకుంది. కొత్త పొత్తులు, ఎత్తులు దిశగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. భాజపాతో దోస్తీతో ఎన్నికల బరిలోకి దిగుతున్న అన్నాడీఎంకే సీట్ల సర్దుబాటు చర్చలు ప్రారంభించగా..  మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత, ప్రముఖ సినీ హీరో కమల్‌హాసన్‌ ఏఐఎస్‌ఎంకే చీఫ్‌, నటుడు శరత్‌ కుమార్‌, ఐజేకే నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అసోంలో ఆర్జేడీ పోటీ

8. మహారాష్ట్ర: 28 జిల్లాల్లో కరోనా విజృంభణ

గత రెండు వారాలుగా మహారాష్ట్రలోని 28 జిల్లాల్లో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. విదర్భ, అమరావతి, అకోలా, యావత్మాల్‌ జిల్లాల్లో హాట్‌స్పాట్లను గుర్తించినట్లు వారు తెలిపారు. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇందులో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల కేసులే ఎక్కువ శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫిబ్రవరిలో పెరిగిన కేసులు ముఖ్యంగా విదర్భ, నాగ్‌పూర్‌, పుణె, ముంబయి, థానే, అమరావతి ప్రాంతాల్లోనే నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మోదీ రాజీపడతారని చైనాకు తెలుసు: రాహుల్

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కేంద్రం, ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ తన విమర్శల పర్వాన్ని కొనసాగించారు. తమిళనాడులో తూత్తుకుడిలోని ఓ కళాశాలలో మాట్లాడుతూ..చైనాతో సరిహద్దు వివాదాన్ని ప్రస్తావించారు. దేశ ప్రయోజనాల విషయంలో ప్రధాని రాజీపడతారని చైనాకు తెలుసని ఆరోపించారు. భారత్‌లో ప్రజస్వామ్యం చచ్చిపోయిందంటూ తీవ్రంగా మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఐసీసీ ఆగ్రహానికి గురికాకుండా పిచ్‌లో‌ మార్పులు!

మొతేరా వేదికగా జరిగిన భారత్‌×ఇంగ్లాండ్ డే/నైట్‌ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. అయిదు రోజుల ఆటకు సరిపడేలా పిచ్‌ రూపొందించలేదని ఇంగ్లాండ్ మాజీలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఐసీసీ నుంచి ఎలాంటి ఆంక్షలకు గురికాకుండా ఆఖరి టెస్టులో బ్యాటింగ్‌కు అనుకూలించేలా పిచ్‌ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొతేరా వేదికగా ఆఖరి టెస్టు మార్చి 4న ప్రారంభం కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మొతేరాలోనే ఐపీఎల్‌ 2021 ప్లేఆఫ్స్‌!

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.