
బిజినెస్
ముంబయి: ప్రభుత్వం ధైర్యంగా వేసిన అడుగుల వల్ల దేశంలో పెట్టుబడుల వాతావరణం మెరుగుపడుతుందని.. భారత వృద్ధి 7-8 శాతం మేర నమోదుకాగలదని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా అంచనా వేశారు. ‘ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక సంస్కరణలు మరింత ముందుకు తీసుకెళతాయి. కార్మిక చట్టాలు, వ్యవసాయ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రను పోషించనున్నాయి. ప్రైవేటీకరణ ప్రకటన.. ప్రభుత్వ ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంద’ని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా అభిప్రాయపడ్డారు.