close

Published : 15/01/2021 12:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
14శాతం విక్రయాలు ఆన్‌లైన్‌లోనే

 మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా వెల్లడి

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో బెంజికార్లను ఆన్‌లైన్‌లో కూడా కొనేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా వెల్లడించింది. ఈ కంపెనీ ఆన్‌లైన్‌ సేల్స్‌ 14శాతం వరకు ఉండటం విశేషం. గతేడాది బెంజ్‌ విక్రయాలు దాదాపు 42శాతం తగ్గాయి. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌వంటివి దీనికి కారణంగా నిలిచాయి. కానీ, ఏడాది చివర్లో కంపెనీ పుంజుకొని కొవిడ్‌ ముందు నాటి స్థాయికి విక్రయాలను చేర్చింది. మొత్తం 7893 వాహనాలను విక్రయించింది.

కంపెనీ ఆన్‌లైన్‌ విక్రయాలు కూడా గణనీయంగా పుంజుకోవడం కలిసొచ్చింది.  మొత్తం విక్రయాల్లో 1250 వాహనాలను ఆన్‌లైన్‌లో విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.  కంపెనీ ఆన్‌లైన్‌ విభాగాన్ని ఏర్పాటు చేసిన 15 నెలల్లోనే ఈ  స్థాయిలో విక్రయాలు చేయడం విశేషం. 2025 నాటికి మొత్తం అమ్మాకాల్లో 25 శాతం ఇంటర్నెట్‌లోనే జరుగుతాయని పేర్కొంది.  భవిష్యత్తులో తమ ఈ కామర్స్‌ వేదికను మరింత అభివృద్ధి చేయనున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు.  అలాగని తమ డిలర్‌షిప్స్‌ విషయంలో ఎటువంటి రాజీలేదని పేర్కొంది. 

ఇదీ చదవండి

ఈ బ్యాటరీ జీవితకాలం 16 ఏళ్లు..!

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని