ప్రభుత్వానికి సీఐఐ సూచన
దిల్లీ: కంపెనీల కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో కొవిడ్-19 వ్యాక్సినేషన్లో కొన్ని అంశాలను జతచేయాల్సిందిగా ప్రభుత్వానికి భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సూచించింది. 2013 కంపెనీల చట్టం ప్రకారం.. లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు మూడేళ్ల సగటు నికర లాభంలో కనీసం 2 శాతాన్ని సీఎస్ఆర్ కార్యకలాపాలపై ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ వ్యయాలను వ్యాక్సినేషన్ ప్రక్రియకు అంగీక రిస్తే, కంపెనీలు తమ ఉద్యోగులకు వ్యాక్సిన్లు అందిస్తాయని.. తద్వారా మరింత మందికి సులభంగా వ్యాక్సిన్లు చేరుతాయని సీఐఐ టాస్క్ఫోర్స్ పేర్కొంది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్లకు సీఐఐ టాస్క్ఫోర్స్ పలు ముఖ్యమైన సిఫారసులు చేసింది. ప్రజలకు వ్యాక్సిన్లు అందించడానికి పీపీపీ పద్ధతిలో మొదటి దశ నుంచే ప్రైవేట్ రంగ సామర్థ్యాలను వినియోగించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?