ఆర్థికవేత్త అరుణ్ కుమార్
దిల్లీ: ప్రభుత్వం చెబుతున్నంత వేగంగా మన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం చెందడం లేదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 25 శాతం క్షీణించవచ్చని ఆర్థికవేత్త అరుణ్ కుమార్ పేర్కొన్నారు. సేవారంగంలోని కీలక విభాగాలు, అసంఘటిత రంగం ఇంకా కోలుకోకపోవడమే ఇందుకు కారణమన్నారు. జీడీపీ భారీగా క్షీణిస్తున్నందున, బడ్జెట్ ప్రతిపాదనలను సవరించాల్సి ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్-మే నెలల్లో లాక్డౌన్ వల్ల అత్యవసర ఉత్పత్తులు మాత్రమే తయారయ్యాయని గుర్తు చేస్తూ, వ్యవసాయ రంగంలోనూ వృద్ధి ఉండదనేదే తన అంచనాగా వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ క్షీణత 7.5 శాతానికి పరిమితం కావచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 7.7 శాతం క్షీణించవచ్చని జాతీయ గణాంకాల కార్యాలయం అంచనా వేసిన నేపథ్యంలో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎకనామిక్స్ మాజీ ప్రొఫెసర్ అయిన అరుణ్‌కుమార్ ఇలా పేర్కొనడం గమనార్హం. జీడీపీ ఏప్రిల్-జూన్‌లో 23.9 శాతం, జులై-సెప్టెంబరులో 7.5 శాతం క్షీణించిందని పేర్కొన్న ప్రభుత్వమే, ఈ అంచనాల్లో సవరణలు ఉండొచ్చని పేర్కొనడాన్ని అరుణ్‌కుమార్ ప్రస్తావించారు. ద్రవ్యలోటు గత ఆర్థిక సంవత్సరం కంటే బాగా అధికంగా ఉండొచ్చని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం కూడా లక్ష్యానికి బాగా దూరంగా మిగిలిపోవచ్చని, పన్ను-పన్నేతర ఆదాయాలూ తగ్గొచ్చని వివరించారు. కొవిడ్ టీకాలు వేయడం ఎంత త్వరగా పూర్తయి, ప్రజలు సాధారణ కార్యకలాపాలకు దిగితే, ఆర్థిక వ్యవస్థ అంత త్వరగా కోలుకుంటుందని విశ్లేషించారు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?