close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/08/2020 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మళ్లీ తగ్గిన జీఎస్టీ వసూళ్లు

దిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి తగ్గాయి. జులై నెలకు సంబంధించి రూ.87,422 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇదే ఏడాది జూన్‌ నెలలో రూ.90,917 కోట్లు వసూలు అవ్వగా.. ఈ సారి అంతకంటే తక్కువ వసూలు కావడం గమనార్హం. అయితే, కొవిడ్‌ కారణంగా ఇచ్చిన వెసులుబాటు నేపథ్యంలో ఎక్కువ మంది జూన్‌లో తమ పాత బకాయిలు చెల్లించడంతో ఆ నెల వసూళ్లు పెరిగినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. 

జులై నెలకు గానూ వసూళ్లలో సీజీఎస్టీ రూపంలో రూ.16,147 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూపంలో రూ.21,418 కోట్లు, ఐజీస్టీ రూపంలో రూ.42,592 కోట్లు సమకూరినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. సెస్సుల రూపంలో రూ.7,265 కోట్లు వచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.32, 172 కోట్లు, మే నెలలో రూ.61,151 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్‌ కలిగిన పన్ను చెల్లింపుదారులకు ఫైలింగ్‌కు సెప్టెంబర్‌ వరకు వెసులుబాటు ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.