close

తాజా వార్తలు

Published : 30/10/2020 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒప్పంద ఉద్యోగాలకు పెరిగిన గిరాకీ

ఒప్పంద లేదా తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునే ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి ఆసక్తి పెరిగిందని ఇన్‌డీడ్‌ నివేదిక తెలిపింది. 2020 జనవరి- జులై మధ్య ఈ ఉద్యోగాలకు 119 శాతం మేర డిమాండు పెరగ్గా.. నియామక ప్రకటనల్లో 119 శాతం వృద్ధి ఉందని తెలిపింది. కొవిడ్‌-19 పరిణామాలతో వివిధ రంగాల్లో కంపెనీల మూసివేతలు, ఉత్పత్తుల కోత లాంటివి చోటు చేసుకోవడం ఇందుకు కారణమైందని తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి కాంట్రాక్టు ఉద్యోగులకు గిరాకీ స్థిరంగా పెరుగుకుంటూ వచ్చిందని నివేదిక పేర్కొంది. 2019 జూన్‌, జులైతో పోలిస్తే 2020 జూన్‌, జులైలో వరుసగా ఒప్పంద ఉద్యోగుల నియామకాలు 110%; 143 శాతం చొప్పున పెరిగాయని తెలిపింది. వెబ్‌సైట్‌లో ఒప్పంద ఉద్యోగాల కోసం అన్వేషించడం కూడా మూడు రెట్లు పెరిగిందని వివరించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.