అమెజాన్ ప్రైమ్ వీడియో
దిల్లీ: అంతర్జాతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విపణుల్లో భారత్ ఒకటని అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. స్థానిక భాషల్లో మరింత కంటెంట్ రూపొందించేందుకు పెట్టుబడులు కొసాగిస్తామని, దేశంలో మరింత మందికి చేరువకావడమే లక్ష్యమని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, కంట్రీ జనరల్ మేనేజర్ గౌరవ్ గాంధీ పేర్కొన్నారు. భారత వినియోగదారుల కోసం మొబైల్లో మాత్రమే వినియోగించుకునే విధంగా ఎయిర్టెల్తో కలిసి అమెజాన్ ప్రైమ్ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ‘గత నాలుగేళ్లుగా దేశంలో స్థిరంగా వృద్ధిచెందుతున్నాం. దేశంలో 4300కు పైగా నగరాలు, పట్టణాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలను వీక్షిస్తున్నారు. 10 భాషల్లో సొంత నిర్మాణం, చిత్రాలపై పెట్టుబడులు ఇందుకు దోహదపడుతున్నాయి’ అని గాంధీ వెల్లడించారు.
Tags :
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?