close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/06/2020 02:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

100 ఎస్‌ఎంఎస్‌లపైనా ఛార్జీలుండవ్‌

నిబంధన తొలగించిన ట్రాయ్‌

దిల్లీ: ప్రస్తుతం ఒక్కో సిమ్‌ నుంచి రోజుకు ఉచితంగా 100 సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎమ్‌ఎస్‌) వరకు పంపుకోవచ్చు. ఆపైన ఒక్కో ఎస్‌ఎంఎస్‌కు కనీసం 50 పైసల మేర ఛార్జీ విధించాలన్నది మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ నిబంధన. అయితే తాజాగా ఆ నిబంధనను ట్రాయ్‌ తొలగించింది. టెలీ మార్కెటింగ్‌, అవాంఛిత వాణిజ్య సమాచారాలకు అడ్డుకట్టవేసేందుకు అప్పట్లో ట్రాయ్‌ ఆ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో వాణిజ్యేతర వినియోగదార్లు భారీ సంఖ్యలో చేసే ఎస్‌ఎంఎస్‌లపై ఛార్జీలను విధించడానికి ఆపరేటర్లకు స్వేచ్ఛ ఉండేది. అయితే నిజమైన వాణిజ్యేతర వినియోగదార్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాజాగా ఈ నిబంధనను తొలగించింది. ఆ మేరకు టెలికాం టారిఫ్‌ ఆదేశాలు-2012లోని ఆ ప్రత్యేక నిబంధనను తొలగిస్తూ సవరణ చేసింది. ట్రాయ్‌ నిర్వహించిన తొలి దృశ్యమాధ్యమ సమావేశం ద్వారా జరిగిన బహిరంగ చర్చ (ఓహెచ్‌డీ) అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అవాంఛిత ఎస్‌ఎంఎస్‌ల విషయంలో 2018లోనే ఒక సరికొత్త, బలమైన సాంకేతికతతో ఒక వ్యవస్థను తీసుకొచ్చిన విషయాన్ని ట్రాయ్‌ గుర్తు చేసింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.