close

తాజా వార్తలు

Updated : 13/08/2020 14:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరింత తక్కువ ధరకు రెమిడెసివిర్‌ !

దిల్లీ: కరోనా వైరస్‌ చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్‌ ధర మరింత తగ్గింది. ‘రెమ్‌డాక్‌’ పేరుతో జైడస్‌ క్యాడిలా సంస్థ దీనిని మార్కెట్లోకి తెచ్చింది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో లభిస్తుందని జైడస్‌ ప్రకటించింది. 100 ఎంజీ పరిమాణం గల ఒక వయల్‌ ధర రూ.2800 అని ప్రకటించింది. ఇప్పటి వరకు వివిధ కంపెనీలు విడుదల చేసిన రెమిడెసివిర్‌ ధరతో పోలిస్తే ఇది తక్కువని సంస్థ వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఔషధ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ కొవిడ్‌  ఔషధాన్ని దేశవ్యాప్తంగా పటిష్టమైన సరఫరా వ్యవస్థ ద్వారా అందిస్తామని సంస్థ ఎండీ డాక్టర్‌ షర్విల్‌ పటేల్‌ తెలిపారు. 

దేశంలో రెమిడెసివిర్‌ను అందుబాటులోకి తెచ్చిన ఐదో సంస్థగా జైడస్‌ క్యాడిలా నిలిచింది. ఇప్పటి వరకు హెటిరో, సిప్లా, మైలాన్‌, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌‌ సంస్థలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు భారత్‌తో సహా 127 దేశాల్లో రెమిడెసివిర్‌ను విడుదల చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌, సింజీన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లు కూడా రంగంలోకి దిగుతున్నాయి. ఇందుకు గాను అవి గిలియడ్‌ సైన్సెస్‌తో సంప్రదింపులు జరుపుతున్నాయి. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.