close

Updated : 16/01/2021 12:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
యాపిల్‌ స్టోర్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ ఉత్పత్తులు కొనుగోలు చేసేవారికి ఆ‌ సంస్థ శుభవార్త చెప్పింది. యాపిల్‌ స్టోర్‌ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్‌ చేస్తే రూ.5వేలు క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఆరు నెలల నో కాస్ట్‌ ఈఎంఐ వెసులుబాటు కల్పిస్తోంది. అయితే, అర్హత కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డును ఉపయోగించి రూ.44,900కు మించిన ధర ఉన్న వస్తువును కొనుగోలు చేసిన వారికే ఈ క్యాష్‌బ్యాక్‌ వర్తిస్తుందని పేర్కొంది. బహుళ ఆర్డర్లకు, ఉన్నత చదువుల కోసం ప్రత్యేకంగా ఇచ్చే ఎడ్యుకేషన్‌ ప్రైసింగ్‌కు ఈ ఆఫర్‌ వర్తించదని స్పష్టం చేసింది. జనవరి 21 నుంచి జనవరి 28 వరకే ఈ ఆఫర్ అందుబాటులో‌ ఉంటుందని, వస్తువు డెలివరీ అయిన తర్వాత క్యాష్‌బ్యాక్‌ వస్తుందని యాపిల్‌ సంస్థ వెల్లడించింది.

ఇదీ చదవండి

14 శాతం విక్రయాలు ఆన్‌లైన్‌లోనే

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని