close

తాజా వార్తలు

Published : 10/08/2020 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మౌలిక రుణాలకు ప్రత్యేక సంస్థ

త్వరలో కేంద్ర మంత్రిమండలి ముందుకు ప్రతిపాదన

దిల్లీ: మౌలిక రంగ సంస్థలకు అవసరమైన రుణాల కోసం క్రెడిట్‌ గ్యారెంటీ ఎన్‌హ్యాన్స్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రిమండలి పరిశీలనకు రానుంది. వచ్చే అయిదేళ్లలో మౌలిక రంగంలో వసతుల అభివృద్ధికి దాదాపు రూ.111 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి అవసరమైన నిధుల సమీకరణకు ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. క్రెడిట్‌ గ్యారెంటీ ఎన్‌హ్యాన్స్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు 2019-20 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఐఐఎఫ్‌సీఎల్‌, ఎల్‌ఐసీ, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, ఇటువంటి తరహా కంపెనీలతో భాగస్వామ్యంలో క్రెడిట్‌ గ్యారెంటీ ఎన్‌హ్యాన్స్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఒక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)గా ఏర్పాటు కానుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.