close

తాజా వార్తలు

Published : 09/08/2020 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నగరాల్లో గిడ్డంగులకు గిరాకీ

అదే రోజు డెలివరీ కోసమే

దిల్లీ: నగరాల పరిధిలో చిన్న పాటి గిడ్డంగులకు వచ్చే ఏడాది పాటు గిరాకీ పెరగనుంది. ఇ-కామర్స్‌ సంస్థలు వినియోగదార్లు ఆర్డరు చేసిన రోజునే డెలివరీ చేయడం కోసం ఆహార, నిత్యావసర వస్తువులను నిల్వ ఉంచుకోవడం కోసం వీటికి గిరాకీ కనిపిస్తోందని ఒక నివేదిక పేర్కొంది. 5000-10,000 చ. అడుగుల పరిమాణంలో గల వాటి కోసం కంపెనీలు ఎక్కువగా శోధించవచ్చని ప్రోపర్టీ కన్సల్టెంట్‌ కొలియర్స్‌ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. ‘కరోనా కారణంగా ఆహార, నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఎక్కువగా ఇ-కామర్స్‌ కంపెనీలపైనే ఆధారపడుతున్నారు. అందులోనూ అదే రోజు డెలివరీని కోరుకుంటున్నారు. దీంతో కంపెనీలు సైతం వినియోగదార్లకు దగ్గరగా ఉండే ప్రదేశాల్లో ఉత్పత్తులను నిల్వ చేయాలను భావిస్తున్నాయ’ని తన నివేదిలో పేర్కొంది. ఇంకా ఆ నివేదికలో ఏముందంటే..
* వచ్చే 12 నెలల్లో నగరాల్లోని గిడ్డంగులకు గిరాకీ పెరగవచ్చు. చిన్న పాటి పంపిణీ కేంద్రాలుగా వాటిని ఉపయోగించవచ్చు.
* ముంబయి, బెంగళూరు, చెన్నై, ఎన్‌సీఆర్‌ వంటి ప్రధాన కేంద్రాల్లో 5,000-10,000 చ. అ. శ్రేణిలోని కేంద్రాలకు ఎక్కువ గిరాకీ కనిపించవచ్చు.
* పాత, పెద్దగా వినియోగించని కార్యాలయ స్థలాలు, సేవా కేంద్రాలు సైతం చిన్నపాటి గిడ్డంగులుగా మారిపోయే అవకాశం ఉంది.
* ఆన్‌లైన్‌ వ్యాపారాలను పెంచుకోవడం కోసం అదనపు గిడ్డంగుల సామర్థ్యాన్ని పెంచుకోవడంపై కంపెనీలు ఎక్కువ దృష్టి సారించాయి.
* భారత్‌లోని ప్రధాన నగరాల్లో గిడ్డంగులు కేవలం నగర సరిహద్దులకే పరిమితం అయ్యాయి. ఇపుడు నగరాల్లోకి అవి రావడం వల్ల రవాణా వ్యయాలు, డెలివరీ సమయం తగ్గించుకోవచ్చు.
* ఇ-కామర్స్‌ కంపెనీలు, థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్‌ కంపెనీల నుంచి ఎక్కువ గిరాకీ కనిపించవచ్చు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.