close

తాజా వార్తలు

Published : 12/08/2020 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మార్కెట్‌ కబురు

* ఉబ్బసం(ఆస్తమా) వ్యాధి చికిత్సకు ఉపయోగించే జిలేటన్‌ మాత్రలను అమెరికా మార్కెట్లో ఆవిష్కరించినట్లు లుపిన్‌ తెలిపింది. ఇవి చైజీ యూఎస్‌ఏ ఇంక్‌కు చెందిన జైఫ్లో సీఆర్‌ మాత్రలకు జనరిక్‌ వర్షన్‌ అని ఆ కంపెనీ తెలిపింది.

* వచ్చే మూడేళ్లలో తమ నెట్‌వర్క్‌ను 50 కొత్త నగరాల్లోకి విస్తరించనున్నట్లు స్కోడా ఆటో వెల్లడించింది. 2022 కల్లా కనీసం రెండింతల విక్రయ, సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

* అర్హత ఉన్న సంస్థాగత కొనుగోలదార్ల(క్యూఐబీ)కు ఈక్విటీ షేర్లను కేటాయించడం ద్వారా రూ.10,000 కోట్లను సమీకరించినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

* సింగపూర్‌ ప్రభుత్వంతో పాటు పలు అర్హత గల మదుపర్లకు షేర్లను జారీ చేయడం ద్వారా రూ.10,000 కోట్ల నిధులను సమీకరించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ మంగళవారం తెలిపింది. ఎన్‌సీబీల ద్వారా మరో రూ.3,693 కోట్లనూ సమీకరించింది.

* జీపీఎక్స్‌ గ్లోబల్‌ సిస్టమ్స్‌ ఇండియా కార్యకలాపాలను 161 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.1202 కోట్లు)తో కొనుగోలు చేసినట్లు డేటా సెంటర్స్‌ కంపెనీ ఈక్వినిక్స్‌ ప్రకటించింది.

* తన గిడ్డంగులు, పారిశ్రామిక పార్కుల వ్యాపారాన్ని రూ.1700-2000 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువతో నగదీకరించడానికి పలు అవకాశాలను స్థిరాస్తి దిగ్గజం ఎంబసీ గ్రూప్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

* వాహన విడిభాగాల తయారీ సంస్థ మిండా ఇండస్ట్రీస్‌ తన రూ.250 కోట్ల రైట్స్‌ ఇష్యూకు ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.250 చొప్పున బోర్డు నిర్ణయించినట్లు తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.