close

తాజా వార్తలు

Published : 13/08/2020 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నియామకాలు స్వల్పంగా పుంజుకున్నాయ్‌

జూన్‌తో పోలిస్తే జులైలో 5 శాతం అధికం
నౌకరీ జాబ్‌ స్పీక్‌ సూచీ వెల్లడి

దిల్లీ: లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగించిన తర్వాత కంపెనీల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవ్వడంతో నియామకాల పరిస్థితి కాస్త మెరుగైంది. జూన్‌తో పోలిస్తే జులైలో ఉద్యోగ నియామకాలు 5 శాతం పెరిగాయని నౌకరీ జాబ్‌స్పీక్‌ సూచీ ఆధారంగా తెలుస్తోంది. ఈ సూచీ ప్రకారం.. జూన్‌లో 1,208 ఉద్యోగ నియామక ప్రకటనలు వెలువడగా, జులైలో ఈ సంఖ్య స్వల్పంగా పెరిగి 1,263గా నమోదైంది. అయితే 2019 జులైతో పోలిస్తే ఈ ఏడాది జులైలో నియామకాల ప్రకటనలు 47 శాతం తక్కువగానే ఉండటం గమనార్హం. నౌకరీ డాట్‌కామ్‌ వెబ్‌సైట్‌కు వచ్చే ఉద్యోగ ప్రకటనల ఆధారంగా నియామకాల పరిస్థితి ఎలా ఉందో నౌకరీ జాబ్‌ స్పీక్‌ సూచీ అంచనా వేస్తుంది. ఈ సూచీ ప్రకారం..
* ఏడాది క్రితంతో పోలిస్తే ఈ జులైలో ఆతిథ్యం, రెస్టారెంట్లు, విమానాశ్రయాలు, పర్యాటక రంగంలో ఉద్యోగ ప్రకటనలు 80 శాతం తగ్గాయి. రిటైల్‌ విభాగంలో 71%, స్థిరాస్తిలో 60%, చమురు- గ్యాస్‌ విద్యుత్‌లో 58% చొప్పున ప్రకటనలు తగ్గాయి.
* బీపీఓ, ఐటీ ఆధారిత సేవలు లాంటి కీలక రంగాల్లోను ఉద్యోగ ప్రకటనలు 42 శాతం మేర తగ్గాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ (39%), ఔషధం, బయోటెక్‌ (38%), ఐటీ- హర్డ్‌వేర్‌ (30%), వైద్యం లేదా ఆరోగ్య సంరక్షణ (20%) రంగాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది.
* కొవిడ్‌-19 కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతుండటం, లాక్‌డౌన్‌ ఆంక్షలు కారణంగా పెద్ద నగరాల్లో నియామకాల ప్రకటనలు 50 శాతానికి పైగా తగ్గాయి. దేశవ్యాప్త సగటైన 47% కంటే ఇది ఎక్కువ. చెన్నైలో 55%, ముంబయి, బెంగూళూరులలో 54% మేర ఉద్యోగ ప్రకటనలు తగ్గాయి. చండీగఢ్‌ (28%), జైపూర్‌ (25%), కోచి (33%) లాంటి చిన్న నగరాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది.
* ఫలానా ఉద్యోగ హోదా అనే తేడా లేకుండా అన్ని స్థాయిల్లోనూ నియమాకాలు తగ్గాయి. ఫ్రెషర్స్‌ నుంచి 3 ఏళ్ల అనుభవం వరకు ఉన్న స్థాయిల్లో నియామకాలు గణనీయంగా 51 శాతం మేర క్షీణించాయి.
* అయితే జూన్‌తో పోలిస్తే మీడియా, వినోద పరిశ్రమల్లో ఉద్యోగ ప్రకటనలు 36 శాతం మేర పెరిగాయి. నిర్మాణం, ఇంజినీరింగ్‌ విభాగంలో 27%, బ్యాంకింగ్‌ ఆర్థిక సేవలు, బీమా రంగంలో 16%, వాహన రంగంలో 14%, టెలికాంలో 13%, ఐటీ హార్డ్‌వేర్‌ 9% చొప్పున పెరిగాయి.
* విద్యా రంగంలో నియామక ప్రకటనలు 22% క్షీణించగా.. ఆతిథ్య రంగంలో 5%, రిటైల్‌ విభాగంలో 2 శాతం చొప్పున తగ్గాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.