close

తాజా వార్తలు

Published : 23/09/2020 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మార్కెట్‌ కబుర్లు

* గుజరాత్‌ రిఫైనరీ సామర్థ్యం పెంపు, పెట్రోకెమికల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి రూ.17,825 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ప్రకటించింది.

* దేశం వెలుపల డేటా ఫ్రీ ఫ్లో విత్‌ ట్రస్ట్‌ (డీఎఫ్‌ఎఫ్‌టీ) ప్రతిపాదనను భారత్‌ తిరస్కరించింది. ఈ విషయాన్ని జీ20 ప్రతినిధులతో జరిగిన వర్చువల్‌ సమావేశంలో వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయల్‌ వెల్లడించారు.

* ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌ (ఐఎస్‌ఏ) సభ్య దేశాల్లోని సౌర ప్రాజెక్టులపై 10 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.75,000 కోట్లు) కోట్లు చొప్పించేందుకు ప్రపంచ సోలార్‌ బ్యాంక్‌ సన్నాహాలు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

* మార్కెట్‌ నిబంధనలు ఉల్లంఘినందుకు సెక్యూరిటీస్‌ మార్కెట్లలోకి రాకుండా 12 మంది దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) ప్రమోటర్లపై సెబీ నిషేధం విధించింది.

* ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ మార్పిడి రహిత డిబెంచర్ల రుణ రేటింగ్‌ ఇవ్వడంలో నిర్లక్ష్యంపై ఇక్రా, కేర్‌, ఇండియా రేటింగ్స్‌పై చెరి రూ.కోటి జరిమానాను సెబీ విధించింది.

* ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వైద్య కళాశాల అభివృద్ధి, ఒడిశాలో 93 స్కూళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు రుద్రాభిషేక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ దక్కించుకుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.