21% పెరిగి రూ.2,968 కోట్లకు చేరిన లాభం
ఒక్కో షేరుకు రూ.1 డివిడెండు
దిల్లీ: ఐటీ సేవల దిగ్గజం విప్రో ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. 2020-21 డిసెంబరు త్రైమాసికంలో రూ.2,968 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.2,455.9 కోట్లతో పోలిస్తే ఇది 20.8 శాతం అధికం. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.15,470.5 కోట్ల నుంచి 1.3 శాతం పెరిగి రూ.15,670 కోట్లకు చేరింది.
* సెప్టెంబరు త్రైమాసికంతో పోల్చినా, డిసెంబరు త్రైమాసికంలో విప్రో ఆదాయం 3.9 శాతం పెరిగి 207.1 కోట్ల డాలర్లుగా నమోదైంది. అక్టోబరు అంచనాల (202.2-206.2 కోట్ల డాలర్ల)కు మించే ఉంది.
* ఐటీ ఉత్పత్తుల నుంచి సమీక్షా త్రైమాసికంలో కంపెనీ రూ.160 కోట్ల (2.13 కోట్ల డాలర్లు) ఆదాయం ఆర్జించగా, భారత ప్రభుత్వ సంస్థల నుంచి రూ.240 కోట్ల (3.28 కోట్ల డాలర్లు) వ్యాపారాదాయం లభించింది.
* రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.1 చొప్పున డివిడెండు చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
* ‘ఆర్డర్ బుకింగ్లు, లాభాదాయాల్లో వరుసగా రెండో త్రైమాసికంలోనూ బలమైన ప్రదర్శన కనబరిచాం. 5 విభాగాలు 4 శాతానికి పైగా త్రైమాసిక వృద్ధి నమోదు చేశాయి. ఇదివరకు ఎప్పుడూ లేనంతగా ఐరోపా ఖండంలో అతి పెద్ద ఒప్పందాలు జరిగాయి. గిరాకీ వాతావరణం చూస్తే స్థిరంగా వృద్ధి చెందుతూనే ఉంది. ప్రధానంగా డిజిటల్ ఫార్మేషన్, డిజిటల్ కార్యకలాపాలు, క్లౌడ్ సేవలకు మంచి గిరాకీ కనిపిస్తోంద’ని విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ థియర్రీ డెలాపోర్ట్ వెల్లడించారు.
* కంపెనీ మార్జిన్లు 22 త్రైమాసికాల గరిష్ఠ స్థాయికి చేరాయని విప్రో ముఖ్య ఆర్థికాధికారి జతిన్ దలాల్ వెల్లడించారు.
* 2020 డిసెంబరు 31 నాటికి కంపెనీలో 1,90,308 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
* డిసెంబరు 1 నుంచి 80 శాతం మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వగా, జనవరి 1 నుంచి వేతనాల పెంపు అమలు చేస్తున్నామంది.
మార్చిలోనూ వృద్ధి సాధిస్తాం
ఐటీ సేవల నుంచి అధికంగా ఆదాయం పొందే విప్రో ప్రస్తుత మార్చి త్రైమాసికంలో 210.2-214.3 కోట్ల డాలర్ల (సుమారు రూ.15,765-16,072 కోట్లు) మధ్య ఆదాయం ఆర్జించే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రకారం, త్రైమాసిక ప్రాతిపదికన మార్చి త్రైమాసికంలో వృద్ధి 1.5-3.5% మధ్య ఉండే అవకాశం ఉంది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?