55 లక్షల డోసులు కొనుగోలు చేసిన ప్రభుత్వం
విరాళంగా 16.5 లక్షల డోసులను ఇవ్వనున్న భారత్ బయోటెక్
ఈనాడు, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా 11 నగరాలకు కొవాగ్జిన్‌ను విజయవంతంగా రవాణా చేసినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ తెలిపింది. భారత్‌లో అభివృద్ధి చేసి, తయారు చేసిన తొలి కొవిడ్-19 టీకా, కొవాగ్జిన్ ప్రస్థానంలో ఇదో కీలక మైలురాయిగా అభివర్ణించింది. కొవాగ్జిన్ అత్యంత శుద్ధి చేసిన, ఇనాక్టివేటెడ్ సార్స్-కొవ్-2 వ్యాక్సిన్. ఈ టీకాను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సహకారంతో ప్రపంచంలో తొలి బీఎస్ఎల్-3 (బయో సేఫ్టీ లెవల్-3) బయోకంటైన్మెంట్ కేంద్రంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. 30 కోట్ల డోసులకు పైగా వివిధ వ్యాక్సిన్లను అందించిన వెరో సెల్ ప్లాట్‌ఫాంలో కొవాగ్జిన్ టీకాను సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఈ టీకా కోసం భారత ప్రభుత్వం 55 లక్షల డోసులకు ఆర్డరు ఇచ్చింది. దీనికి అదనంగా 16.5 లక్షల డోసులను విరాళంగా అందించనున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. తొలి దశ సరఫరాలో భాగంగా (ఒక్కో వయల్‌లో 20 డోసులు) గన్నవరం, గువాహటి, పట్నా, దిల్లీ, కురుక్షేత్ర, బెంగళూరు, పుణె, భువనేశ్వర్, జయపుర్, చెన్నై, లఖ్‌నవూ తదితర నగరాలకు శంషాబాద్ విమానాశ్రయం ద్వారా రవాణా చేసినట్లు సంస్థ బుధవారం వెల్లడించింది. స్పైక్ ప్రొటీన్‌కు విరుద్ధంగా పనిచేసే కొవాగ్జిన్ కొరోనా కొత్త స్ట్రెయిన్లనూ సమర్థంగా ఎదుర్కొంటుందని సంస్థ స్పష్టం చేసింది. టీకా ఉత్పత్తికి సహకరించిన ప్రభుత్వానికి, క్లినికల్ పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్లకు సంస్థ కృతజ్ఞతలు తెలియజేసింది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?