close

Published : 18/01/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
2030కి 100 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం

ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ పి.కె.సత్పతి

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 97 శాతం సామర్థ్యాన్ని వినియోగించడం ద్వారా 35 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని వెలికి తీయాలన్న లక్ష్యంతో ప్రభుత్వరంగ ఎన్‌ఎండీసీ పనిచేస్తోంది. 2030 నాటికి వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 100 మిలియన్‌ టన్నులకు చేర్చాలన్నది ప్రణాలికగా ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ (ఉత్పత్తి) పి.కె.సత్పతి తెలిపారు. ఉక్కు తయారీసంస్థలకు ఆటంకాలు లేకుండా, నిరంతరం ఖనిజం సరఫరా చేయడమే తమ ఆశయమని పేర్కొన్నారు.  
గిరాకీకి తగిన సరఫరా లేకే ధరల మంట: ఏప్రిల్‌-నవంబరు మధ్య దేశీయంగా ఇనుప ఖనిజం ఉత్పత్తి 110.5 టన్నులకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో జరిగిన ఉత్పత్తి 152.3 టన్నులతో పోలిస్తే, ఇది 27.5 శాతం తక్కువ. ఖనిజం ధర అంతర్జాతీయంగా పెరుగుతోందని, చైనాతో పాటు దేశీయంగా గిరాకీ ఇందుకు కారణమని వివరించారు. దిగుమతి చేసుకుంటున్న ధరలతో పోలిస్తే 30-40 శాతం, దేశీయ సరఫరాదార్లతో పోల్చినా 20-25 శాతం తక్కువకే ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజాన్ని అందిస్తోందని వెల్లడించారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని