దిల్లీ: గత రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన బంగారం ధర శుక్రవారం మళ్లీ పెరిగింది. రూ.286 పెరగడంతో దేశ రాజధానిలో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 48,690కి చేరింది. అటు వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. రూ. 558 పెరగడంతో బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 65,157 పలికింది. క్రితం రెండు సెషన్లలో బంగారం ధర రూ. 500పైనే తగ్గడం గమనార్హం.
ప్రపంచ స్టాక్ ఎక్స్ఛేంజీ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో బంగారంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని మదుపర్లు భావించారు. దీంతో అంతర్జాతీయ విపణిలో పసిడి ధర పెరిగింది. దీనికి తోడు డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడంతో దేశీయంగా ఈ లోహాల ధరలు పెరిగినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్(కమాడిటీస్) తపన్ పటేల్ తెలిపారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 1,852 డాలర్లు, ఔన్సు వెండి ధర 25.40 డాలర్లుగా ఉంది.
ఇవీ చదవండి..
14శాతం విక్రయాలు ఆన్లైన్లోనే..
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?