పలు రుణ యాప్ డెవలపర్లకు గూగుల్ నోటీసులు
ఇంటర్నెట్ డెస్క్: ఆన్లైన్ రుణాలు ఇస్తూ రుణగ్రహీతలపై వేధింపులకు పాల్పడుతున్న యాప్స్‌పై గూగుల్ ఇండియా చర్యలు తీసుకుంది. పదుల సంఖ్యలో రుణ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. పలు యాప్స్ ద్వారా రుణాలు తీసుకున్న వారిపై అధిక వడ్డీలు విధించి రుణం చెల్లించాలని వేధింపులకు గురిచేస్తుండటంతో ఇటీవల పలువురు రుణగ్రహీతలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఇలాంటి కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇప్పటికే ఇలాంటి దారుణాలకు పాల్పడే పలు యాప్‌ల నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్బీఐ నిబంధనలను ఈ యాప్స్ ఉల్లంఘిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ప్లేస్టోర్‌లోని వందలాది దేశీయ రుణయాప్స్పై గూగూల్ రివ్యూ చేసింది. యూజర్ రివ్యూలు, ప్రభుత్వ సంస్థల హెచ్చరికల ఆధారంగా.. 30 రుణ యాప్స్ స్థానిక చట్టాలను, యూజర్ ప్రైవసీని ఉల్లంఘిస్తున్నట్లు గూగుల్ గుర్తించింది. దీంతో ఆ యాప్స్‌పై నిషేధం విధిస్తూ.. ప్లే స్టోర్ నుంచి తొలగించింది. వీటిలో లేజీ పే, క్యాష్ గురు, 10మినిట్స్ లోన్, రూపీ క్లిక్, ఫైనాన్స్ బుద్ధవంటి యాప్స్ ఉన్నాయి. ‘‘కొన్ని రుణ యాప్స్ యూజర్ సేఫ్టీ పాలసీలను ఉల్లంఘించినట్లు గుర్తించి వెంటనే ప్లే స్టోర్ నుంచి తొలగించాం. మరికొన్ని యాప్స్ డెవలపర్లకు వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చాం. స్థానిక చట్టాలకు, నిబంధనలకు లోబడే యాప్ నిర్వహిస్తున్నారో లేదో చెప్పాలని కోరాం. వివరణ ఇవ్వకపోతే.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తాం’’అని గూగుల్ ఇండియా వెల్లడించింది. ఈ రుణ యాప్స్ విషయంలో జరిగే విచారణకు సహకరిస్తామని గూగుల్ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి..
దా‘రుణ’ యాప్‌ల కేసులో మరిన్ని ఆధారాలు
సిగ్నల్, టెలిగ్రాం డౌన్లోడ్లు ఎన్ని పెరిగాయంటే..!
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?