close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హార్డ్‌వేర్‌ అంకురాల ప్రోత్సాహానికి కేంద్ర ఐటీ శాఖతో టి-హబ్‌ జట్టు

ఈనాడు, హైదరాబాద్‌: హార్డ్‌వేర్‌, ఇంటర్నెట్‌ ఆధారిత పరికరాల తయారీ రంగంలో పనిచేస్తున్న అంకురాలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లోని టి-హబ్‌, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), డిజిటల్‌ ఇండియాతో చేతులు కలిపింది. ఇందులో భాగంగా డిజిటల్‌ ఇండియా స్కేల్‌ అప్‌ కార్యక్రమాన్ని టి-హబ్‌ మరింత ముందుకు తీసుకెళ్లనుంది. ఈ రంగాల్లోని సంస్థలు ఉత్పత్తి స్థాయికి చేరుకునేందుకు, వాటికి పెట్టుబడులు వచ్చేందుకు, కొత్త మార్కెట్లలోకి ప్రవేశించేందుకు కృషి చేస్తుంది. ఇందుకోసం రవాణా, ఇంధన, వ్యవసాయ, ఏరోస్పేస్‌, ఉత్పత్తి, వినియోగ, ఆరోగ్య సంరక్షణ, స్మార్ట్‌ నగరాలు, సరఫరా తదితర రంగాల్లోని 10-15 అంకురాలను ఇందుకోసం ఎంపిక చేయనున్నట్లు టి-హబ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. దరఖాస్తు చేసుకున్న అంకురాలను నిపుణులు నిశితంగా పరిశీలిస్తారని పేర్కొంది. హార్డ్‌వేర్‌, ఐఓటీ రంగాల్లో వినూత్న, సమస్యలకు పరిష్కారం అందిస్తోన్న అంకురాలను గుర్తించి, వాటిని మరోదశకు తీసుకెళ్లే లక్ష్యంతో ఉన్నట్లు టి-హబ్‌ సీఈఓ రవి నారాయణ్‌ తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.