close
 • హైదరాబాద్‌లోని హోటల్‌ తాజ్‌డెక్కన్‌లో ఏర్పాటు చేసిన ‘ఆర్కాయం ఫ్యాషన్‌&లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌’లో సందడి చేస్తున్న నటి రాశీసింగ్‌.
 • చాలాకాలం తర్వాత వెండితెరపై ‘వకీల్‌సాబ్‌’గా వస్తున్న పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు అభిమానుల్లాగే తాను కూడా ఎదురు చూస్తున్నానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. కుటుంబసభ్యులతో కలిసి రేపు సాయంత్రం సినిమా చూస్తున్నానని పేర్కొంటూ.. పవన్‌ హెయిర్‌స్టైల్‌ను తాను సరిచేస్తున్న ఓ అరుదైన చిత్రాన్ని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు.
 • స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఆయన నివాసానికి అభిమానులు పోటెత్తారు. వారిని పలకరించిన బన్నీ ఓ అభిమాని బహూకరించిన మొక్కను స్వీకరించారు.
 • పెరూ రాజధాని లీమాకు సమీపంలోని తీర ప్రాంతం విల్లా ఐ సాల్వెడార్‌లో కొవిడ్‌ సోకిన తమ ఆత్మీయుల కోసం ఆక్సిజన్‌ సిలిండర్లను దొర్లించుకుంటూ తీసుకెళ్తున్న యువతులు.
 • ఆగ్రహంతో ఊగిపోతూ మిడతల దండును తరుముతున్న ఈ బాలుడి పేరు స్టీఫెన్‌ ముడొగ. కెన్యాలోని ఎల్బర్గన్‌లో ఉన్న తమ పొలంలో సంచరిస్తున్న మిడతల్ని తాను పాఠశాల నుంచి తిరిగి రాగానే ఇలా వెంబడించే పనిలో పడ్డాడు. ఆ దేశంలో ఇది విత్తు నాటే సమయం. కానీ, వర్షాలు రావడం ఆలస్యం కావడంతో ఆ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. వర్షాలు రాక ముందే ఈ మిడతల దండును సంహరిస్తే అవి వృద్ధి చెందకుండా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 • ‘కరోనా టీకాల కొరత ఉందంటూ’ మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని పలు టీకా పంపిణీ కేంద్రాల బయట బోర్డులు వెలిశాయి. కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో టీకాతో రక్షణ లభిస్తుందని ఆశించి వస్తున్న ప్రజలు నిరాశగా వెనుదిరుగుతున్నారు. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించగా.. ఇప్పటికి దాదాపు 9కోట్ల మంది వరకు టీకా వేయించుకున్నారు. అందులో దాదాపు కోటి మందికి పైగా రెండో డోసు కూడా తీసుకున్నారు.
 • యువ కథానాయకుడు అఖిల్‌, దర్శకుడు సురేందర్‌రెడ్డి కాంబోలో ‘ఏజెంట్’ చిత్రం ఖరారైంది. అఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. కింగ్‌ నాగార్జున క్లాప్‌ కొట్టగా ఆయన సతీమణి అమల కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. ‘ఏజెంట్’ ఫస్ట్‌లుక్‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది.
 • తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు తిరుమల నుంచి ప్రచారం ప్రారంభించారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన బాలాజీనగర్‌లోని కార్యకర్తలు రాజుయాదవ్‌, టెంకాయల కేశవులు ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
 • గుంటూరు రూరల్‌ మండలం లాలుపురంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న దివ్యాంగురాలు ప్యారం దుర్గమ్మ
 • గుంటూరు మిర్చియార్డు టిక్కీలతో పూర్తిగా నిండిపోయింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక వాహనాల సంఖ్య పెరగడంతో లోపలికి వెళ్లడానికి ఖాళీ లేక యార్డు నుంచి చుట్టుగుంట సెంటర్‌ వరకు బారులు తీరాయి. బుధవారం కొనుగోళ్ల తర్వాత కూడా ఏకంగా 2,29,519 బస్తాలు అక్కడే ఉన్నాయి. కాలు తీసి కాలు పెట్టేందుకైనా వీలు లేకపోవడంతో గురువారం సరకు తీసుకురావద్దని మిర్చియార్డు కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి రైతులకు సూచించారు.
 • ఆదిలాబాద్‌ పట్టణంలోని రైతుబజార్‌లో సాయంత్రం ఆరు దాటితే చీకట్లు కమ్ముకుంటున్నాయి. విద్యుత్తు వెలుగులు నామమాత్రంగానే ఉంటున్నాయి. రైతులతో పాటు కొనేందుకు వచ్చిన ప్రజలు సైతం ఇబ్బంది పడుతున్నారు. బయట విక్రయించే వ్యాపారులు బ్యాటరీ లైట్ల సహాయంతో, లోపల ఉన్నవారు చరవాణుల వెలుతురులో అమ్మకాలు సాగిస్తున్నారు. ఏవి మంచివో.. ఏవి కుళ్లిపోయినవో ఇంటికి వెళితే కానీ తెలియడంలేదని వినియోగదారులు వాపోతున్నారు.
 • తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ చంద్రబాబు వెంట ఉన్నారు.
 • ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా రెండో డోసు టీకా తీసుకున్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ రెండో డోసు టీకా వేయించుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
 • మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా అంబజోగై పట్టణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక శ్మశాన వాటిక ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలను పేర్చి దహనం చేశారు.
 • మొక్కలు నాటితే అవి అమ్మలా అండనిస్తాయి. ప్రాణవాయువును అందిస్తాయి. సేదదీరేందుకు నీడనిస్తాయి. దర్శి నుంచి పొదిలి వెళ్లే మార్గం పొడవునా తోరణాల్లా ఉన్న ఈ వృక్షాలను చూడండి. నిప్పులు కురిసే మండుటెండలో ఇటుగా వచ్చే వాహనదారులు, పాదచారులకు ఆహ్లాదాన్ని అందిస్తూ తమ విలువను చెప్పకనే చెబుతున్నాయి.
 • ఒక చిన్న సైజు కారులో కూడా ఇంత మంది ప్రయాణించడం కష్టమేమో? కానీ ఒక ద్విచక్ర వాహనంపై చిన్నా పెద్దా కలిసి ఏడుగురు ప్రయాణిస్తూ రికార్డు సృష్టించారు. బుధవారం తెలంగాణ శాసన సభ ఎదురుగా కనిపించిన దృశ్యం ఇది.
 • పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు. కానీ అతిప్రేమ ఉండకూడదు. ఓ పోలీసు రహదారిపై ద్విచక్ర వాహనం నడుపుతూ పసిపిల్లాడికి యాక్సిలరేటర్‌ ఇచ్చిన దృశ్యమిది. ఎంత రైజింగ్‌ ఇస్తే ఏం జరుగుతుందో పిల్లాడికి ఏం తెలుసు. ఇదేదో ఖాళీ రోడ్డు కాదు, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై విజయవాడ స్క్రూబ్రిడ్జి నుంచి బెంజిసర్కిల్‌ వైపు వెళ్తూ కనిపించిన దృశ్యమిది.
 • పర్యాటకులకు జలక్రీడలు అన్నా, స్పీడ్, జెట్‌ స్కై బోట్లలో వేగంగా నీటిపై వెళ్లడమన్నా ఎంతో థ్రిల్‌గా ఉంటుంది. కానీ అదే సమయంలో జాగ్రత్తలు మరువకూడదు. విజయవాడ భవానీద్వీపంలో ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తున్న యువకుడి దృశ్యమిది.
 • బిడ్డను కని మానవత్వాన్ని మరిచి మురుగుకాలువల్లో.. ముళ్ల తుప్పల్లో పడేస్తున్న మనుషులున్న సమాజానికి.. బిడ్డ పట్ల తల్లికి ఎంత ప్రేమ ఉండాలో నేర్పింది ఓ శునకం. విగతజీవి అయిన తన బిడ్డను వదిలేయకుండా ఇది గంటపాటు తల్లడిల్లిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని శివాలయం రహదారిలో బిడ్డ కళేబరం చుట్టూ తిరుగుతూ కుక్క రోదించిన తీరు చూపరులను కలిచివేసింది.
 • విజయవాడ బందరు కాల్వ గట్టుపై పచ్చగా ఎదిగిన చెట్లు నగరవాసులకు ఆహ్లాదం పంచుతున్నాయి.
 • ఒకపక్క రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. మాస్క్‌లు ధరించాలంటూ పోలీసులు జరిమానాలు వేస్తున్నా కొంతమందిలో మార్పు రావడం లేదు. ఏలూరు రోడ్డులో ఓ రెస్టారెంట్‌ ముందు ప్రచారం కోసం ఏర్పాటు చేసిన బొమ్మకు మాస్క్‌ పెట్టారు. ఆ బొమ్మ పక్కనే కూర్చున్న ఇద్దరు యువకులు మాత్రం మాస్క్‌లు లేకుండా కబుర్లు చెప్పుకుంటున్నారు.
 • ‘కొత్త ఆలోచనలు... వినూత్న ప్రయోగాల’తో నేటి నిరుద్యోగ యువత స్వయం ఉపాధి వైపు పయనిస్తున్నారు. విశాఖకు చెందిన అజయ్‌ అనే యువకుడు తన బుల్లెట్‌ వాహనం వెనుక భాగాన్ని వంటశాలగా మార్చుకుని వేడి వేడి పదార్థాలను వండి విక్రయిస్తున్నారు. బుల్లెట్‌పై నగరంలో ఎక్కడికైనా సులువుగా ప్రయాణిస్తూ... తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్‌ఏడీ కొత్తరోడ్డు దరి మర్రిపాలెంలో బుల్లెట్‌ను నిలిపి వ్యాపారం చేస్తున్నప్పటిదీ దృశ్యం.
 • పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలతో పాటు మూగజీవాలు అల్లాడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం శ్రీరామనగరం సద్గురు చిట్టిబాబాజీ సంస్థానంలో ప్రతిరోజు అభిషేకాల్లో పాల్గొనే గజరాజు(లీల) ఎండల వేడిమికి అవస్థలు పడుతుండడంతో ఇలా పైపు నీటితో ఉపశమనం కలిగిస్తున్నారు.
 • విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌కు ఓ భారీ చేప విక్రయానికి వచ్చింది. కుంభకోనాంగా పిలిచే ఈ చేప 270 కిలోలు ఉంది. దీనిని ఓ వ్యక్తి రూ.40 వేలకు కొనుగోలు చేశారు.
 • నిలువెత్తునా పచ్చని కాయలతో కన్పిస్తున్న ఈ పనస చెట్టు విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం సమీపంలోని నీటిపారుదల శాఖ విభాగానికి చెందిన క్వార్టర్స్‌లోని ఓ ఇంటి ముందు కనిపించింది. నేలను అనుకుని విరగకాయడంతో స్థానికులు దీనిని ఆసక్తిగా చూస్తున్నారు.
 • తిరుమల కనుమదారిలో కొండల మధ్య కురిసిన పొగమంచు భక్తులను ఆకట్టుకుంది. రెండు కొండల మధ్య పాలనురగలా కమ్ముకున్న పొగమంచు కనుమదారి ప్రయాణికులకు ఆహ్లాదాన్ని ఇచ్చింది.
 • వజ్రాలు, నీలమణులు పొదిగిన ఈ అభరణాలు ఫ్రెంచ్‌ విప్లవ నేత నెపోలియన్‌ బోనాపార్ట్‌ దత్తపుత్రికకు చెందినవి. వచ్చే నెల జెనీవాలో వేలం వేయనున్న వీటిని బుధవారం నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌ డ్యాంలో క్రిస్టీస్‌ అక్షన్‌ హౌస్‌ మహిళా ఉద్యోగి ఇలా ప్రదర్శించారు.
 • ఏప్రిల్‌ మొదటి వారంలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుతున్న ఎండలు.. మనుషులు, జంతువులతో పాటు పంటలకూ నష్టం చేస్తున్నాయి. నల్గొండ జిల్లాలో సాగు చేస్తున్న డ్రాగన్‌ పంట పిందెలు నిలువునా ఎండిపోతున్నాయి. దీన్ని అధిగమించేందుకు అనుముల మండల కేంద్రంలో ఓ యువరైతు పాత చీరలను సేకరించి పంటకు కప్పి ఎండవేడి నుంచి రక్షించే ప్రయాణం చేస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు