నటుడు సన్నీదెవోల్‌ కు కరోనా - Actor Sunny Deol tests positive for coronavirus
close
Published : 02/12/2020 14:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నటుడు సన్నీదెవోల్‌ కు కరోనా

దిల్లీ: బాలీవుడ్‌ నటుడు, భాజపా ఎంపీ సన్నీదెవోల్‌ (64) కరోనా బారిన పడ్డారు. వైరస్‌ బారిన పడినట్లు ఆయన బుధవారం ఉదయం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటున్నా. ఈమధ్య కాలంలో నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోండి’ అని ట్వీట్‌ చేశారు.

పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌ ఎంపీ అయిన సన్నీకి కొద్దిరోజుల క్రితం ముంబయిలోని ఓ ఆసుపత్రిలో భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. అనంతరం కులులోని ఫాంహౌజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆరోగ్యం మెరుగవ్వడంతో మిత్రులతోకలిసి ముంబయి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కొవిడ్‌ పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో ఆయన ముంబయి ప్రయాణాన్ని విరమించుకొని ఫాంహౌజ్‌లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని