ప్రభాస్‌ పాత్ర పోషించడానికి భయం లేదు - Bellamkonda Sai Sreenivas reveals the reason behind opting for the Hindi remake of Chatrapathi
close
Published : 06/12/2020 09:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ పాత్ర పోషించడానికి భయం లేదు

ఆరు సినిమాలు.. 200 మిలియన్ల వ్యూస్‌

హైదరాబాద్‌: ‘అల్లుడుశీను’తో కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు బెల్లకొండ సాయిశ్రీనివాస్‌. మొదటి సినిమాతో ప్రేక్షకులను అలరించిన శ్రీనివాస్‌.. ఆ తర్వాత ‘సాక్ష్యం’, ‘జయ జానకి నాయక’ లాంటి కుటుంబకథా చిత్రాలతో అభిమానులకు మరింత చేరువయ్యారు. శ్రీనివాస్‌ నటించిన చిత్రాలు హిందీలో డబ్‌ కావడంతో ముంబయిలో కూడా ఆయన క్రేజ్‌ సంపాదించుకున్నాడు. దీంతో ఆయన అక్కడి ప్రేక్షకులనూ అలరించాలనే ఉద్దేశంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘ఛత్రపతి’ చిత్రంతో బీటౌన్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైన శ్రీనివాస్‌ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

‘నేను ఇప్పటివరకూ ఏడు సినిమాల్లో నటించాను. వాటిల్లో ఆరు చిత్రాలు(హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌) యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూ‌స్‌ సాధించాయి. సినిమాల వల్ల ముంబయి, దిల్లీ ప్రాంతాల్లో ప్రజలు నన్ను గుర్తుపడుతున్నారు. అది నాకెంతో సంతోషంగా అనిపించింది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అనుకుంటున్నా. ఇంతకుముందు చాలా ఆఫర్స్‌ వచ్చినప్పటికీ నాకు సరిపడే స్ర్కిప్ట్‌ దొరకలేదు. ‘ఛత్రపతి’ కథ నాకు సరిపోతుందని అనుకుంటున్నా. ఒరిజినల్‌ వెర్షన్‌లో ప్రభాస్‌ పోషించిన పాత్రను రీక్రియేట్‌ చేయడానికి భయపడడం లేదు. అలాగే బాలీవుడ్‌కు చెందిన ఎక్కువమంది ప్రేక్షకులు ఒరిజినల్‌ చిత్రాన్ని వీక్షించలేదు’

‘దశాబ్దం క్రితం తెరకెక్కించినప్పటికీ ‘ఛత్రపతి’ చిత్రాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. అయితే మేము ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని అందరికీ చేరువయ్యేలా స్ర్కిప్ట్‌లో మార్పులు చేశాం. కెరీర్‌పరంగా నేను తీసుకున్న అదిపెద్ద నిర్ణయం ఇదే.. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా.’ అని బెల్లంకొండ శ్రీనివాస్‌ వివరించారు. ‘అల్లుడు శీను’తో ఆయన్ని కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం చేసిన వి.వి.వినాయక్‌.. ‘ఛత్రపతి’ బాలీవుడ్‌ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నారు.

‘సీత’ చిత్రం తర్వాత శ్రీనివాస్‌ తెలుగులో నటిస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నభా నటేశ్‌, అనుఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. నటుడు సోనూసూద్‌ ఓ కీలకపాత్రలో మెప్పించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

ఇవీ చదవండి

చిట్టి చెల్లికి పెళ్లంట.. మహేశ్‌ లుక్‌ వైరల్‌

స్కిల్‌ స్మిత బయోపిక్‌లో అనసూయ?


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని