నేను విద్యా బాలన్‌ను డిన్నర్‌కు పిలవలేదు...! - Cancelled lunch not shoot MP minister
close
Published : 30/11/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను విద్యా బాలన్‌ను డిన్నర్‌కు పిలవలేదు...!

ప్రచారంపై మంత్రి విజయ్‌ షా స్పష్టత

ఇండోర్‌: బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ ‘షేర్ని’ చిత్రం షూటింగ్‌ను తను ఆపలేదని మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌ షా స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. ‘వాళ్లు బాలాఘాట్‌లో సినిమా షూటింగ్‌ కోసం అనుమతి తీసుకున్నారు. నన్ను డిన్నర్‌కు రమ్మని ఆహ్వానించారు. ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పాను. మహారాష్ట్రకు వచ్చినప్పుడు కలుస్తానని చిత్ర బృందానికి తెలిపా. దీంతో భోజన ఏర్పాట్లు ఆగిపోయాయి, సినిమా షూటింగ్‌ కాదు. నన్ను వాళ్లు ఆహ్వానించారే కానీ నేను కాదు..’ అని విజయ్‌ పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా ‘షేర్ని’ చిత్రం షూటింగ్‌ మధ్యప్రదేశ్‌లో జరుగుతోంది. అడవుల్లో సాగే సన్నివేశాల చిత్రీకరణ కోసం కొన్ని వారాల క్రితం విద్యాబాలన్‌ అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆమెను విజయ్‌ షా డిన్నర్‌కు ఆహ్వానించారని.. దాన్ని నటి తిరస్కరించారని వదంతులు వచ్చాయి. ఆ మరుసటి రోజు అటవీశాఖ అధికారులు ప్రొడక్షన్‌ హౌస్‌ వాహనాల్ని అడవుల్లోకి అనుమతించలేదని, అవి అక్కడే ఆగిపోయాయని ప్రచారం జరిగింది. సినిమా షూటింగ్‌ను కూడా ఆపేశారని చెప్పుకొచ్చారు. దీనిపై ఇప్పుడు మంత్రి స్పందించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని