డ్రగ్స్‌ సమస్య ఉంది కానీ..: అక్షయ్‌ ఆవేదన - How can I say that drug problem does not exist in Bollywood says Akshay Kumar
close
Published : 05/10/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రగ్స్‌ సమస్య ఉంది కానీ..: అక్షయ్‌ ఆవేదన

చిత్ర పరిశ్రమను చెడుగా చూడొద్దు

ముంబయి: డ్రగ్స్‌ వ్యవహారం బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడటంతో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి. నిజానిజాలు తేలకముందే సోషల్‌మీడియా వేదికగా నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్షయ్‌ స్పందించారు. చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ సమస్య ఉందని.. కానీ ప్రతి ఒక్కరికీ దీనితో సంబంధం లేదని పేర్కొన్నారు.

‘పరిశ్రమలో ఈ సమస్య తలెత్తిన తర్వాత మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిత్ర పరిశ్రమలో వేధింపులు, డ్రగ్స్‌ వాడకం లాంటి సమస్యలపై కూడా దృష్టి పెట్టాలని అర్థమైంది. బాలీవుడ్‌లో ఈ సమస్య లేదని నేనెలా చెప్పగలను?అది కుదరదు. కానీ ప్రతి సెలబ్రిటీ ప్రమేయం ఇందులో లేదు. నాకు అధికారులపై నమ్మకం ఉంది. వాళ్లు సరైన నిర్ణయం తీసుకుంటారు. విచారణకు ప్రతి ఒక్కరు సహకరిస్తారని చెప్పగలను. మొత్తం చిత్ర పరిశ్రమను చెడుగా చూడొద్దని కోరుతున్నా.. అది చాలా తప్పు’.

‘మీడియా ఎంతో గొప్పది.. దానికి పవర్‌ ఉంది. చెడుకు వ్యతిరేకంగా మీ గళం వినిపించండి. కానీ సున్నితంగా వ్యవహరించండి. ఎందుకంటే మీరు రాసే ఓ నెగిటివ్‌ వార్త ఓ వ్యక్తి పూర్తి కెరీర్‌ను నాశనం చేస్తుంది’ అని అక్షయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ వ్యవహారంలో నటి రియా చక్రవర్తిని అరెస్టు చేసిన ఎన్సీబీ... దీపికా పదుకొణె, సారా అలీ ఖాన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, శ్రద్ధా కపూర్‌ తదితరుల్ని విచారించింది. వీరి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి కోర్టుకు సమర్పించనుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని