అభిమానులకు సల్మాన్‌ఖాన్‌ విన్నపం - Iam not in apartment do not gather there Salman appealed fans
close
Published : 27/12/2020 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అభిమానులకు సల్మాన్‌ఖాన్‌ విన్నపం

ముంబయి: తన పుట్టిన రోజును పురస్కరించుకుని తన అపార్టుమెంటు ముందు ఎవరూ గుమికూడవద్దని బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ తన అభిమానులను కోరారు. ఆదివారం ఆయన 55వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రతి సంవత్సరం సల్మాన్‌ జన్మదినం సందర్భంగా వేలాది మంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు బాంద్రాలోని ఆయన నివాసం ముందుకు చేరుకుంటారు. అయితే, ఈసారి తాను అపార్టుమెంటులో లేనని, కరోనా నేపథ్యంలో ఎవరూ అక్కడికి రావొద్దని కోరారు.

‘ఎన్నో ఏళ్లుగా నా పుట్టినరోజు సందర్భంగా మీరు నా నివాసం వద్దకు చేరుకొని ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎవరూ అక్కడ గుమికూడవద్దు. మాస్కు పెట్టుకోండి. శానిటైజ్‌ చేసుకోండి. అందరూ సామాజిక దూరం పాటించండి. నేను అపార్టుమెంటులో లేను. ధన్యవాదాలు’ అని ఆయన పేర్కొన్నారు. సల్మాన్‌ఖాన్‌ ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్‌-14లో బిజీగా ఉన్నారు. తన పుట్టినరోజును అదే కార్యక్రమంలో జరుపుకొనే అవకాశం ఉంది.

ఇదీ చదవండి..

‘పుష్ప’ ప్రతినాయకుడిగా ఆర్య..?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని