
తాజా వార్తలు
నిహారిక పెళ్లి పత్రిక ఇదేనా?.. ఫొటోలు వైరల్
హైదరాబాద్: సినీ నటుడు నాగబాబు కుమార్తె, కథానాయిక నిహారిక కొణిదెల మరో వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. చైతన్య జొన్నగడ్డ ఆమె మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. కాగా నిహారిక వివాహ ఆహ్వాన పత్రిక ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ పెద్ద పెట్టెలో పెళ్లి పత్రికతో పాటు అతిథుల నోరు తీపి చేయడానికి స్వీట్లు కూడా పంపారు. పత్రికలో చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లను కూడా ముద్రించారు. మరి ఇది అసలైందో, కాదో తెలియాలంటే కొణిదెల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పత్రికను పంచుకోవాల్సిందే.
గుంటూరు మాజీ ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో ఆగస్టులో నిహారికకు నిశ్చితార్థం జరిగింది. డిసెంబరు 9న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోగల ఉదయ్ విలాస్‌లో శుభకార్యం జరగబోతోంది. ఇటీవల నిహారిక తన స్నేహితుల కోసం గోవాలో బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేశారు.