close

తాజా వార్తలు

Published : 08/08/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆమె మాటలు స్ఫూర్తిదాయకం: నాగ చైతన్య

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ బారినపడిన సామాన్యులు ఎలా విజేతలుగా నిలిచారనే విషయంపై  ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇటీవల ప్రత్యేక చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌ వేదికగా ఈ చర్చను ఆయన నిర్వహించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్యను నామినేట్‌ చేశారు. ఇటీవల నాగచైతన్య... సునీత అనే నర్సుతో ఆన్‌లైన్‌లో ముచ్చటించారు. ఇప్పుడు ఈ బృహత్‌ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లాలంటూ ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ను చైతన్య నామినేట్‌ చేశారు. 

కొవిడ్‌-19ను జయించిన సునీత అనే నర్సుతో చైతన్య గత వారం ఆన్‌లైన్‌ ద్వారా ముచ్చటించిన విషయం తెలిసిందే. ఈ చర్చలో సునీత మాటలు చాలా సహాయకరంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. ‘‘కరోనా సోకిందని తెలియగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతుంటారు. నిజానికి తీవ్ర భయం, ఒత్తిడికి గురవ్వడం వల్లే ఎక్కువ సమస్యలొస్తాయి. ఈ భయాలతోనే చాలా మందిలో వైరస్‌ లక్షణాలున్నా బయటకు చెప్పలేకపోతున్నారు. ఫలితంగా ప్రాణాపాయ పరిస్థితుల్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ముందు ఇలాంటి అనవసర భయాల్ని వీడండి’’ అని నాగచైతన్య కోరారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.