అలా ఎవరైనా అంటే నమ్మకండి: పూరీ - Puri Musings about One moment by Puri Jagannadh
close
Published : 30/10/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలా ఎవరైనా అంటే నమ్మకండి: పూరీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్కువ తిను, తక్కువ నిద్రపో, రోజూ ఏదో ఒకటి నేర్చుకో అంటున్నారు పూరి జగన్నాథ్‌. జీవితంలో ఎదగటానికి.. వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకోవాలని సూచిస్తున్నారాయన. పూరి మ్యూజింగ్స్‌ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌లో ద్వారా మరెన్నో విషయాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘వన్‌ మోమెంట్‌’ గురించి మాట్లాడారు.

‘‘ఏదో ఒక సందర్భం రోజును మారుస్తుంది. రోజులోని మార్పు జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ మలుపు తిరిగిన జీవితం ప్రపంచాన్ని మార్చేస్తుందని బుద్ధుడు చెప్పారు. పుస్తకంలోని ఓ పేజీ, మీరు చదివిన ఓ కొటేషన్‌, విమానంలో మీ పక్కన కూర్చున్న వ్యక్తి, ఒక సినిమా లాంటివి ఏవైనా నీ జీవితాన్ని మార్చేయొచ్చు. అవకాశం ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియదు. చాలా సార్లు అవి అవకాశాలే అన్న విషయమూ తెలియకపోవచ్చు. అందువల్ల ప్రతీ క్షణం అలర్ట్‌గా ఉండాలి. కొంతమందికైతే లక్ష్మీదేవి వచ్చి రోజూ తలుపులు బాదినా వినిపించదు. గాఢ నిద్రలో ఉంటారు’’

‘‘నాకో స్నేహితుడు ఉన్నాడు. అతడికి చాలా టాలెంట్‌ ఉంది. వచ్చిన అవకాశాలను చేజార్చుకోవటం ఎలా అని అతడో పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని తన దగ్గరే పెట్టుకుని తు.చ. తప్పకుండా పాటిస్తున్నాడు. అలాంటి వారు ఈ లోకంలో చాలామందే ఉన్నారు. నీకేంట్రా నువ్వింకా చిన్నపిల్లోడివి అని ఎవరైనా అంటే నమ్మకండి. ఇక్కడ ఎవరికీ సమయం లేదు. కళ్లు మూసి తెరిచేలోపు వృద్ధాప్యం వచ్చేస్తుంది. మిమ్మల్నేవరూ ఎర్రతివాచీ పరిచి ఆహ్వానించరు. ప్రారంభంలో అందరూ నిన్ను ఉపయోగించుకుంటారు. అలా చేస్తున్నారంటే నువ్వు పనికొస్తావని అర్థం. ఇలాంటి సమయంలోనే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అన్నీ వాళ్లే నేర్పిస్తారు. నీ టైం బాగుంటే ఇలాంటి వారంతా ముందే ఎదురవుతారు. మరేం పర్లేదు వాళ్లే నిన్ను మార్చేస్తారు’’

‘‘పడుకునే ముందు కొన్ని టిక్‌టాక్‌లు విను. ఏది నేర్చుకోకుండా నిద్రపోవద్దు. ఎప్పుడూ ఫైర్‌తో ఉండు ఎలాంటి కడుపు నొప్పి ఉండదు. కసిగా ఉండు ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తదు. మూడు పూటలా కలిపి ఎన్ని నిమిషాలు తింటే అంతసేపు వ్యాయామం చేయ్‌. జిమ్‌కు వెళ్లాల్సిన పనిలేదు. 7 నిమిషాల వ్యాయామం కోసం యాప్‌లను ఉపయోగించు. అలర్ట్‌గా ఉన్నప్పుడే అన్ని అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. లేదంటే నీ కళ్ల ముందు అవకాశం ఉన్నా గుర్తించలేవు’’ అని వివరించారు పూరి జగన్నాథ్‌.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని