సల్మాన్‌ఖాన్‌కు కరోనా నెగెటివ్‌ - SalmanKhan and family test covid negative
close
Published : 19/11/2020 18:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సల్మాన్‌ఖాన్‌కు కరోనా నెగెటివ్‌

ముంబయి: బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా నెగెటివ్‌ వచ్చింది. సల్మాన్‌ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరి వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ బాలీవుడ్‌ హీరో కుటుంబంతో సహా స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. గురువారం సల్మాన్‌ ఖాన్‌ కుటుంబం కరోనా పరీక్షలు చేయించుకోగా అందరికీ నెగెటివ్‌ వచ్చింది. కరోనా వచ్చిన తమ సిబ్బందిని మాత్రం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సల్మాన్‌ఖాన్‌కు కరోనా నెగెటివ్‌ వచ్చిందన్న వార్తతో బాలీవుడ్‌ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఆయన ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌-14 హోస్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు ‘రాధే’ చిత్రంలోనూ నటిస్తున్నారు. అయితే.. ఆ చిత్రంలో ఆయనపై అన్ని సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. దిశా పటానీ, రణ్‌దీప్ హుడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రంజాన్‌ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. కానీ.. కరోనా మహమ్మారి కారణంగా అది కుదరలేదు. ఇదిలా ఉండగా.. వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్‌ తేలడంతో సల్మాన్ అభిమానులతో పాటు సినీ దర్శకనిర్మాతలు ఆందోళనకు గురయ్యారు. ఆయనకు కరోనా నెగెటివ్‌ అని తేలడంతో హమ్మయ్య అనుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని