రీఎంట్రీ ఇవ్వడం లేదు‌: సమీరా రెడ్డి - Sameera Reddy is not doing VishalArya film with Anand Shankar
close
Published : 30/10/2020 09:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రీఎంట్రీ ఇవ్వడం లేదు‌: సమీరా రెడ్డి

చెన్నై: బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలో నటించి కొన్నేళ్లపాటు ప్రేక్షకులను అలరించారు నటి సమీరా రెడ్డి. పెళ్లి అనంతరం వెండితెరకు దూరమైన ఆమె ప్రస్తుతం తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. తరచూ తన చిన్నారులతో కలిసి సరదా వీడియోలు చిత్రీకరించి సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమీరారెడ్డి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆర్య, విశాల్‌ ప్రధాన పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించనున్న ఓ కోలీవుడ్‌ చిత్రంలో సమీరా రెడ్డి నటించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కాగా, తాజాగా సదరు వార్తలపై నటి స్పందించారు. అవన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారని వివరించారు.

‘మైనే దిల్‌ తుజ్కో దియా’ అనే బాలీవుడ్‌ చిత్రంతో సమీరారెడ్డి కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘నరసింహుడు’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆమె అనంతరం ‘జై చిరంజీవా’, ‘అశోక్‌’ చిత్రాల్లో కథానాయికగా నటించారు. ‘కృష్ణం వందే జగద్గురుం’లోని ఓ ప్రత్యేక పాటలో ఆమె చివరిగా తెలుగు తెరపై ఆడిపాడారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని