ఆ అమ్మాయి చాలా మంచిది: విజయ్‌ దేవరకొండ - She is A Really Sweet Girl says Vijay Deverakonda and he Praises Ananya Panday
close
Published : 22/11/2020 17:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ అమ్మాయి చాలా మంచిది: విజయ్‌ దేవరకొండ

హైదరాబాద్‌: విజయ్ దేవరకొండ,  పూరీ జగన్నాథ్‌.. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమా వస్తున్న విషయం తెలిసిందే. క్రీడా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే పేరు ఇప్పటికే ఖరారు చేశారు. విజయ్‌ సరసన బాలీవుడ్‌ చిన్నది అనన్య పాండే తెర పంచుకోనుంది. ఛార్మి, కరణ్‌ జోహార్‌ కలిసి నిర్మిస్తున్నారు. అయితే.. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌.. అనన్యను పొగడ్తలతో ముంచెత్తాడు.

‘అనన్య చాలా మంచి అమ్మాయి. ఆమెను తెలుగు సినిమాల్లో చూడాలని దక్షిణాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమాలో ఆమె బాగా నటించింది. ఇప్పటికే సగం షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొస్తుందని గట్టిగా నమ్ముతున్నా’ అని విజయ్‌ అభిప్రాయ పడ్డాడు.
కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమా షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పాల్సి వచ్చింది. క్లైమాక్స్‌ సీన్‌ మాత్రమే మిగిలిపోయినట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు, హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని పలు భాషాల్లో విడుదలకానుంది. టాలీవుడ్‌‌లో మంచి క్రేజ్‌ ఉన్న హీరో, డైరెక్టర్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ‘ఫైటర్‌’పై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు అనన్య సైతం బీటౌన్‌లో మంచి సినిమా ఆఫర్లు కొట్టేస్తోందట.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని