సాగరకన్య న్యూ రెస్టారెంట్‌ అదిరింది - Shilpa Shettys New Mumbai Restaurant
close
Updated : 05/12/2020 12:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాగరకన్య న్యూ రెస్టారెంట్‌ అదిరింది

ఇంటీరియర్‌ డిజైన్‌ చూశారా

ముంబయి: సాగరకన్య శిల్పా శెట్టి వ్యాపార రంగంలో విజయవంతంగా రాణిస్తున్నారు. ఆమె ముంబయిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బాస్టియన్‌ పేరుతో రెస్టారంట్‌లు నడుపుతున్నారు. తాజాగా వర్లీలో మరో శాఖను ఆరంభించబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ శిల్పా ఫొటోలు షేర్‌ చేశారు. రెస్టారంట్‌ సిద్ధమైందని, త్వరలోనే ప్రారంభం కాబోతోందని పేర్కొన్నారు. గత తొమ్మిది నెలల్లో తొలిసారి రాత్రిపూట ఇంటి నుంచి బయటికి వచ్చానని చెప్పారు. ప్రస్తుతం శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రా రెస్టారంట్‌ మెనూ తయారు చేసే పనిలోపడ్డట్టు తెలిసింది. ఇందు కోసం నటులు రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియాల సహాయం తీసుకున్నారు. ‘శిల్పా, రాజ్‌కు ధన్యవాదాలు. న్యూ బాస్టియన్‌లో నిన్న సాయంత్రం ఎంతో అందంగా గడిచింది. ఆహారం ఎంతో రుచికరంగా ఉంది...’ అని జెనీలియా పేర్కొన్నారు. తమ మెనూలోని ఫుడ్‌ను రితేష్‌ జంట రుచి చూశారని రాజ్‌ కూడా పోస్ట్‌ చేశారు. ఎంతో ఖర్చుతో ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇంటీరియర్‌ డిజైన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

శిల్పాశెట్టి వ్యాపారవేత్తగా ముందంజలో ఉన్నారు. 2019లో బాస్టియన్‌ ఆతిథ్యసేవాసంస్థలో 50 శాతం వాటా కొనుగోలు చేశారు. సొంతంగా ఫిట్‌నెస్‌ యాప్‌ను నడుపుతున్నారు. ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ మమాఎర్త్‌లోనూ ఆమె భాగస్వామ్యం ఉంది. దుబాయ్‌లోని బుర్జ్‌ఖలీఫాలో ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. దాని విలువ దాదాపు రూ.50 కోట్లని సమాచారం. ముంబయిలో వీరు నివాసం ఉంటున్న భవంతి కూడా అత్యంత ఖరీదైనదే. మరోపక్క ఆమె ‘సూపర్‌ డ్యాన్సర్‌ చాప్టర్‌ 3’కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ‘సాహస వీరుడు సాగర కన్య’, ‘వీడెవడండీ బాబూ’, ‘ఆజాద్‌’ తదితర చిత్రాలతో ఆమె తెలుగు వారికి సుపరిచితురాలే.

ఇవీ చదవండి..

నా భర్తతో గొడవ అప్పుడే..: జెనీలియా

ఆలియా భట్‌ కలల నివాసాన్ని చూద్దామా!

 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని