Siddharth: సిద్ధార్థ్‌ మృతి.. కావాలనే నన్ను వేధిస్తున్నారు!  - Sidharth Shukla died Telugu news actor siddharth about targeted hate and harassment
close
Published : 03/09/2021 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Siddharth: సిద్ధార్థ్‌ మృతి.. కావాలనే నన్ను వేధిస్తున్నారు! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్దేశపూర్వకంగానే సామాజిక మాధ్యమాల వేదికగా తనని కొందరు ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రముఖ నటుడు సిద్ధార్థ్‌ ఇప్పటికే పలుమార్లు తన బాధని వెలిబుచ్చారు. తాజాగా ఆయనకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఏమైందంటే.. బాలీవుడ్‌ నటుడు, ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌-13’ సీజన్‌ విజేత సిద్ధార్థ్‌ శుక్లా గుండెపోటుతో గురువారం మరణించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్‌ శుక్లా ఫొటోకి బదులు సిద్ధార్థ్‌ ఫొటోని ఎవరో సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ‘రిప్‌ సిద్ధార్థ్‌’ అని జోడించారు. అది కాస్తా సిద్ధార్థ్‌ వద్దకు చేరింది. ట్విటర్‌ వేదికగా అదే ఫొటోని చూపిస్తూ ‘కావాలనే నన్ను ఇలా వేధిస్తున్నారు. ద్వేషిస్తున్నారు’ అని సిద్ధార్థ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

‘బాయ్స్‌’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు సిద్ధార్థ్‌. అజయ్‌ భూపతి దర్శకత్వంలో సిద్ధార్థ్‌ నటించిన ‘మహా సముద్రం’ త్వరలోనే విడుదలకానుంది. ఈ సినిమాలో శర్వానంద్‌ మరో హీరో.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని