కంచిపీఠానికి ఇంటిని విరాళంగా ఇచ్చిన బాలు..! - Singer SP Balasubrahmanyam donates his house to Kanchi Peetham to run Vedic school
close
Published : 26/09/2020 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కంచిపీఠానికి ఇంటిని విరాళంగా ఇచ్చిన బాలు..!

నెల్లూరుతో ప్రత్యేక అనుబంధం

హైదరాబాద్‌: ప్రముఖ గాయకుడు ఎస్పీబాలుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని కోనేటమ్మపేటలో ఆయన 1946 జూన్‌ 4న జన్మించారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లాగా ఆ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. పుట్టి పెరిగిన ఊరు కావడంతో బాలుకి నెల్లూరుతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ఆ ఊరిలో తన తండ్రి నిర్మించిన ఇంటిని కంచి పీఠానికి విరాళంగా అందజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతిని తన నివాసానికి ఆహ్వానించి నెల్లూరులోని ఇంటిని విరాళంగా అందిస్తున్నట్లు తెలియజేశారు. బాలులోని సేవాగుణాన్ని మెచ్చుకున్న విజయేంద్ర సరస్వతి సదరు ఇంటిలో వేద పాఠశాల నిర్వహిస్తామని చెప్పారు. పీఠాధిపతి నిర్ణయంతో ఎంతో సంతోషించిన బాలు.. తన నివాసం ఓ గొప్ప కార్యక్రమానికి వేదికవుతోన్నందుకు ఆనందంగా ఉందని ఆనాటి కార్యక్రమంలో వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని