బెల్లంకొండకు జోడీగా - Telugu News Is This Nushrat Bharucha Plays Lead In Chatrapathi Remake
close
Updated : 17/09/2021 07:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెల్లంకొండకు జోడీగా

ప్రభాస్‌.. రాజమౌళిల హిట్‌ సినిమా ‘ఛత్రపతి’ ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్‌ తెరకెక్కిస్తున్నారు. జయంతిలాల్‌ గడ నిర్మాత. ఇందులో బెల్లంకొండకు జోడీగా ఓ బాలీవుడ్‌ భామ నటించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఆ పాత్ర కోసం తొలుత అనన్య పాండే, దిశా పటాని లాంటి పేర్లు వినిపించాయి. అయితే ఆ అవకాశం బాలీవుడ్‌ భామ నుష్రత్‌ బరుచాను వరించినట్లు సమాచారం. ‘తాజ్‌ మహల్‌’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నాయిక‘ప్యార్‌ కా పంచనామా 2’, ‘డ్రీమ్‌ గర్ల్‌’, ‘సోను కే టిటు కి స్వీటీ’ లాంటి విజయవంతమైన చిత్రాలతో ఉత్తరాది వాసులకు దగ్గరైంది. అందుకే నుష్రత్‌ నటనను మెచ్చే వినాయక్‌ ‘ఛత్రపతి’ రీమేక్‌కు ఆమెను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చిత్ర బృందం ఇప్పటికే ఆమెపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు ప్రచారం వినిపిస్తోంది. నుష్రత్‌ ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌తో కలిసి ‘రామ్‌ సేతు’ చిత్రంలో నటిస్తోంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని