హైదరాబాద్‌లో రామ్‌ చిత్రం - Telugu News Ram Next Peoject Shoot Going On In Hyderabad
close
Updated : 08/08/2021 07:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌లో రామ్‌ చిత్రం

రామ్‌ కథానాయకుడిగా..లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కృతిశెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి, అక్షర గౌడ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో రామ్‌ - ఆది పినిశెట్టిల మధ్య పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. కొండారెడ్డి బురుజు నేపథ్యంలో సాగే సన్నివేశాలవి. రామ్‌ ఇందులో పోలీస్‌గా సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: సుజీత్‌ వాసుదేవ్‌.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని