25 రకాల గెటప్పుల్లో...  - Vikram In 25 Getups
close
Published : 02/12/2020 17:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

25 రకాల గెటప్పుల్లో... 

చెన్నై: పాత్ర కోసం ఎలాంటి సాహసాలకైనా సిద్ధపడే కథానాయకుడు విక్రమ్‌. అందుకు తగ్గట్టుగానే  విభిన్నమైన గెటప్పుల్లో ఆయన తెరపై దర్శనమిస్తుంటారు. అలాంటి కథలే ఆయన దగ్గరికి వస్తుంటాయి. తాజాగా ‘కోబ్రా’ కూడా పలు రకాల గెటప్పులతో కూడిన చిత్రమే. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పునః ప్రారంభమైంది. త్వరలోనే రష్యా వెళ్లనున్నారు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా నటిస్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌ ఏకంగా 25 రకాల గెటప్పుల్లో దర్శనమివ్వనున్నట్టు సమాచారం. సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని