Ram: రామ్‌ కుటుంబంలో విషాదం - actor rams grand father died
close
Updated : 18/05/2021 14:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ram: రామ్‌ కుటుంబంలో విషాదం

భావోద్వేగంతో పోస్ట్‌ పెట్టిన నటుడు

హైదరాబాద్‌: నటుడు రామ్‌ పోతినేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్‌ తండ్రి, రామ్‌ తాతయ్య పోతినేని సుబ్బారావు(91) మంగళవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలియచేశారు. తాతయ్య మరణంతో రామ్ భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబం ఈ స్థాయికి రావడం వెనుక తాతయ్య కృషి, శ్రమ ఉన్నాయని తెలిపారు.

‘‘తాతయ్య.. విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా ప్రారంభమై ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. కుటుంబసభ్యులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు అందించడం కోసం ఆరోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవాళ్లు. మీది రాజు లాంటి మనసు. జేబులో ఉన్న డబ్బుని బట్టి ఎవరూ ధనవంతులు కాలేరని, కేవలం మంచి మనస్సు వల్లే ప్రతిఒక్కరూ ధనవంతులు అవుతారని మీరే మాకు నేర్పించారు. మీ పిల్లలందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి మీరే కారణం. కానీ, ఇప్పుడు మీ మరణవార్త నన్ను ఎంతో కలచివేసింది. నా హృదయం ముక్కలైంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా’ అని రామ్‌ పేర్కొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని