డ్రగ్స్‌ సేవిస్తూ పట్టుబడ్డ టాలీవుడ్‌ హీరోయిన్‌ - actress naira shah arrested consuming drugs
close
Published : 15/06/2021 20:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రగ్స్‌ సేవిస్తూ పట్టుబడ్డ టాలీవుడ్‌ హీరోయిన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బుర్రకథ’ ఫేమ్‌ నైరాషా డ్రగ్స్‌ కేసులో అరెస్టయింది. ఆమెను ఎన్‌.సి.బి(నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో) అధికారులు ముంబయిలో ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నైరా జన్మదినం సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్‌ ఆషిక్‌ సాజిద్‌ హస్సేన్‌తో కలిసి జుహులోని ఒక హోటల్‌ గదిలో పార్టీ చేసుకుంది. సదరు హోటల్‌లో డ్రగ్స్‌ ఉన్నాయన్న సమాచారంతో అదేరోజు తెల్లవారుజామున 3గంటలకు ఎన్‌.సి.బి అక్కడ తనిఖీలు చేసింది. ఈక్రమంలోనే నైరాతో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ సిగరెట్లలో గంజాయి పీలుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. కాగా.. ఇద్దరూ నిషేధిత మాదకద్రవ్యాలు సేవించినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని డ్రగ్స్‌ ఎవరు సరఫరా చేశారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని