డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ నటుడు అరెస్టు.. - ajaz khan picked up from mumbai airport by ncb in drugs case
close
Published : 31/03/2021 13:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ నటుడు అరెస్టు..

ముంబయి: మాదక ద్రవ్యాల కేసులో బాలీవుడ్‌ నటుడిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. బాలీవుడ్, టాలీవుడ్‌ సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో కనిపించే అజాజ్‌ఖాన్‌ను ముంబయి ఎయిర్‌పోర్ట్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ చిక్కిన షాదాబ్‌ను విచారించగా ఈ నటుడి పేరు బయటకు వచ్చింది. అజాజ్‌ఖాన్ ఎక్కువగా తిరిగే అంధేరి, లోఖండ్‌వాలా వంటి కొన్ని ప్రాంతాల్లో ఎన్సీబీ తనిఖీలు చేపట్టింది. ఈ నటుడు డ్రగ్‌ కేసులో అరెస్టు కావడం ఇదే మొదటిసారి కాదు. 2018లో కూడా నవీ ముంబయి యాంటీ నార్కోటిక్‌ పోలీసులు ఇతడిని ముంబయిలోని ఒక హోటల్లో అరెస్టు చేశారు. అలాగే 2020లో సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినందుకు ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను బాలీవుడ్‌ ఎనిమిదో బిగ్‌బాస్‌ సీజన్‌లో కంటెస్టెంట్‌గా చేశాడు. హిందీలో ‘లంహా’, ‘లవ్‌ డే’,  ‘ముంబయి సాగా’ వంటి చిత్రాల్లో నటించగా.. తెలుగులో ‘దూకుడు’, ‘టెంపర్’‌, ‘నాయక్’‌‌ వంటి చిత్రాల్లో కనిపించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని