Allu arjun: అల్లు అర్జున్‌ అరుదైన రికార్డు.. దక్షిణాదిలో ఒకే ఒక నటుడు - allu arjun first south indian actor to have over 13 million followers on instagram
close
Published : 31/08/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Allu arjun: అల్లు అర్జున్‌ అరుదైన రికార్డు.. దక్షిణాదిలో ఒకే ఒక నటుడు

ఇంటర్నెట్‌డెస్క్‌: స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి అభిమానులతో ‘స్టైలిష్‌ స్టార్‌’ అనిపించుకున్న నటుడు అల్లు అర్జున్‌. తన నటన, డ్యాన్స్‌తో యూత్‌ను మెస్మరైజ్‌ చేసి, ఇప్పుడు ‘ఐకాన్‌ స్టార్’ అయిపోయారు. ఇక సోషల్‌మీడియాలో ఆయనకు ఉండే ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేరళలోనూ అక్కడి అగ్ర కథానాయకులకు సమానంగా అల్లు అర్జున్‌కు క్రేజ్‌ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు బన్ని మరో అరుదైన రికార్డు సాధించారు.

ప్రముఖ సామాజిక మాధ్యమ వేదికగా ఇన్‌స్టాగ్రామ్‌లో 13 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న ఏకైక దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్‌ రికార్డు సృష్టించారు. ఆయన తర్వాత 12.9 మిలియన్‌ ఫాలోవర్స్‌తో విజయ్‌ దేవరకొండ రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప’లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాకు సుకుమార్‌ దర్శకుడు. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ‘దాక్కో దాక్కో మేక’ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. తొలి భాగం క్రిస్మస్‌ కానుకగా ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని