ఆ బాలుడి కలను నిజం చేసిన అల్లు అర్జున్‌ - alluarjun fulfilled a little boy dream
close
Published : 26/12/2020 02:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ బాలుడి కలను నిజం చేసిన అల్లు అర్జున్‌

హైదరాబాద్‌: జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన కథానాయకుడిని కలవాలని, ఫొటో తీసుకోవాలని, కనీసం ఆటోగ్రాఫ్ అయినా సంపాదించాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అభిమానుల కలలను నెరవేర్చేందుకు అప్పుడప్పుడు మన హీరోలే సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్‌ ఓ చిన్నారి అభిమానికి అలాంటి సర్‌ప్రైజే ఇచ్చారు.

ఎప్పటికైనా బన్ని ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలన్నది ఓ బాలుడి కోరిక. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్‌ తాను సంతకం చేసిన ఓ కాగితాన్ని తన కుమారుడు అయాన్‌కు ఇచ్చి అనాథాశ్రమానికి పంపారు. క్రిస్మస్‌ సందర్భంగా అయాన్‌ ఆ బాలుడికి బన్ని ఆటోగ్రాఫ్‌ అందజేసి సర్‌ప్రైజ్‌ చేశాడు. అంతేకాదు, అనాథాశ్రమంలో ఉన్న మిగిలిన చిన్నారులకు కూడా పలు గిఫ్ట్‌లు ఇచ్చి, ఆనందపరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. బన్ని సంతకం తీసుకున్న ఆ బాలుడు ఆనందంతో ఎలా ఉబ్బితబ్బిబవుతున్నాడో మీరూ చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని