Bellamkonda: అటు కసరత్తులు.. ఇటు హిందీ పాఠాలు - bellamkonda sreenivas learning hindi and doing gym for chatrapathi remake
close
Published : 29/06/2021 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bellamkonda: అటు కసరత్తులు.. ఇటు హిందీ పాఠాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా తెలుగులో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో ఆయన నటించనున్నాడు. వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం బాగా కష్టపడుతున్నాడు ఈ యంగ్‌ హీరో. పాత్రకు తగ్గట్టు తన శరీరాకృతిని మార్చుకుంటున్నాడు. చూడగానే ఆకట్టుకునేలా కండల్ని పెంచుతున్నాడు. ఇందుకు లాక్‌డౌన్‌ సమయం ఎంతగానో ఉపయోగపడిందట. అంతేకాదు తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్న శ్రీనివాస్‌ హిందీ భాషను నేర్చుకుంటున్నాడు. ఇప్పటికే హిందీ మాట్లాడటం వచ్చినా ఆ భాషపై పట్టు సాధించడం కోసం ఓ శిక్షకుడ్ని నియమించుకున్నాడు. 

పెన్‌ స్టూడియోస్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం జులై రెండో వారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. మరికొన్ని భారతీయ భాషల్లోనూ ఈ సినిమాని డబ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టైటిల్‌, ఇతర తారాగణం, సాంకేతిక బృంద వివరాల్ని మరికొన్ని రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రాన్ని విడుదల చేసి, మంచి విజయం అందుకున్నాడు శ్రీనివాస్‌.

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని